నేరస్థుల్ని తయారుచేసే ఫ్యాక్టరీ వైసీపీ : మంత్రి నిమ్మల

by Naga Rani Yarlagadda |

నేరస్థులను తయారుచేసే ఫ్యాక్టరీ వైఎస్సార్సీపీ పార్టీ అని, బూతునేతలకు ఆ పార్టీపేరు కేరాఫ్ అడ్రస్ గా మారిందని మంత్రి నిమ్మల రామానాయుడు విమర్శించారు.

నేరస్థుల్ని తయారుచేసే ఫ్యాక్టరీ వైసీపీ : మంత్రి నిమ్మల
X

దిశ, వెబ్‌డెస్క్: నేరస్థులను తయారుచేసే ఫ్యాక్టరీ వైఎస్సార్సీపీ పార్టీ అని, బూతునేతలకు ఆ పార్టీపేరు కేరాఫ్ అడ్రస్ గా మారిందని మంత్రి నిమ్మల రామానాయుడు విమర్శించారు. కేబినెట్ సమావేశానికి ముందు సచివాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. వైసీపీ, జగన్ లపై విమర్శలు గుప్పించారు. కాపు నేతలను బూతునేతలుగా మార్చి.. జగన్ వారి జీవితాలను నాశనం చేస్తున్నారని దుయ్యబట్టారు. కాపులకు చంద్రబాబు 5 శాతం రిజర్వేషన్ ఇస్తే.. 2019లో జగన్ ఆ రిజర్వేషన్లను ఏకపక్షంగా రద్దు చేశారన్నారు. కాపులకు కొత్త రిజర్వేషన్ల సంగతి పక్కనపెట్టి.. ఇచ్చిన రిజర్వేషన్లను ఆనాడు నేతలంతా ఎందుకు ప్రశ్నించలేదని నిలదీశారు. 40 సంవత్సరాలుగా రిజర్వేషన్లు కోరుతున్న కాపులంతా నాడు ఏమైపోయారని ప్రశ్నించారు. రాష్ట్ర చరిత్రలో కాపులకు రిజర్వేషన్లు ఇచ్చింది ఇద్దరే ఇద్దరు నేతలన్న నిమ్మల.. వాటిని తొలగించిన ఘనత ముగ్గురు నేతలకు చెందుతుందన్నారు. దామోదరం సంజీవయ్య, చంద్రబాబు కాపులకు రిజర్వేషన్లిస్తే.. నీలం సంజీవరెడ్డి, కాసు బ్రహ్మానందరెడ్డి, జగన్ లు వాటిని రద్దుచేశారన్నారు.

Next Story