- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
గొప్పజాతీయవాది, విద్యా వేత్త ముఖర్జీ: మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ
తన ప్రాణాలు అర్పించిన గొప్ప జాతీయవాది, విద్యావేత్త డా శ్యాం ప్రసాద్ ముఖర్జీ అని మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ కొనియాడారు.

దిశ, రాంనగర్: దేశవ్యాప్తంగా అనేక ప్రజా ఉద్యమాలు నిర్వహించి, తన ప్రాణాలు అర్పించిన గొప్ప జాతీయవాది, విద్యావేత్త డా శ్యాం ప్రసాద్ ముఖర్జీ అని మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ కొనియాడారు. హైదరాబాద్,రాంనగర్ లోని ఆయన నివాసంలో మంగళవారం జన సంఘ్ వ్యవస్థాపకుడు డాక్టర్ శ్యాం ప్రసాద్ ముఖర్జీ వర్ధంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ మాట్లాడుతూ.. జాతీయ సమైక్యత సమగ్రతల కోసం కట్టుబడి ఉన్న శ్యాంప్రసాద్ ముఖర్జీ అహర్నిశలు కృషి చేశారన్నారు. కాశ్మీర్‌కు ప్రత్యేక రాజ్యాంగం ప్రత్యేక ప్రధాని ఉండరాదని ఒకే దేశంలో రెండు రాజ్యాంగాలు, రెండు జెండాలు ఉండవని నినదించి, కాశ్మీర్ విలీనం కోసం ఆందోళనలు నిర్వహించారన్నారు. నేటితరం ఆయన సేవలను ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు. ఆయన ఈ త్యాగ (బలిదాన్ ) ఫలితంగానే భవిష్యత్తులో జమ్ముకాశ్మీర్‌కు ప్రత్యేక ప్రతి పదికను కల్పించే ఆర్టికల్ 370 రద్దు చేసిన ప్రధాని నరేంద్ర మోదీకి ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కైలాస్ నాగేష్, ఓం ప్రకాష్ తదితరులుపాల్గొన్నారు.






