- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
తొలకరి వర్షానికే ‘ముంపు ముప్పు’...
తొలకరి వానకే బస్టాండ్ మునిగింది, పలువురి ఇళ్లలోకి వరదనీరు కూడా పోతున్న ఘటన నర్సాపురం బోరు గ్రామంలోని నేతకాని వాడలో జరిగింది.

దిశ, మంగపేట: ఆదివారం నుండి మండలంలో కురుస్తున్న తొలకరి వర్షాలకే మండల కేంద్రంలో ప్రారంభానికి నోచని బస్టాండ్‌తో పాటు నర్సాపురం బోరు గ్రామంలోని నేతకాని వాడలో పలువురు ఇళ్లలోకి వరదనీరు చేరి ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. మూడు రోజులుగా కురుస్తున్న మోస్తరు వర్షానికి వాతావరణం చల్లబడ్డప్పటికీ వరదనీరు ఇళ్లలోకి చేరడంతో ఆ కుటుంబాలు ఇబ్బందులు పడుతున్నాయి. మండల కేంద్రంలో ప్రధాన రహదారి డబుల్ లేన్ వైడెనింగ్, సెంట్రల్ లైటింగ్ పనులతో కల్వర్టులు నిర్మించడంతో అంబేద్కర్ భవన్ వద్ద అడ్డుగా ఉన్న మట్టితో వరదనీరు ఎటుపోలేని పరిస్థితి ఉంది. ముఖ్యంగా కొత్త బస్టాండ్, అంబేద్కర్ భవన్, రెవిన్యూ కార్యాలయం, సొసైటీ కార్యాలయం, కస్తూర్భా గురుకులం, ఎంఈవో కార్యాలయాలు ముంపుకు గురయ్యే అవకాశాలున్నాయి. కార్యాలయాల వెంబడి ప్రభుత్వ స్థలాల్లో నిర్మించుకున్న కొంత మంది ఇళ్లలోకి సైతం భారీగా వరద చేరే అవకాశం ఉంది. ఇప్పటికైనా రెవిన్యూ, పోలీస్, పంచాయతీరాజ్ అధికారులు మండలంలోని ముంపు ప్రాంతాల్లో ముందస్థు చర్యలు తీసుకోకుంటే వానాకాలం వచ్చే భారీ వర్షాలకు ప్రజలు నిరాశ్రయులయ్యే అవకాశం ఉన్నందున ముందస్తు చర్యలు తీసుకోవాలని ముంపు ప్రాంతాల ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.






