- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
బీఆర్ఎస్ పార్టీ సర్పంచ్‌లపై ఎమ్మెల్యే కడియం శ్రీహరి కక్ష సాధింపు..
ఈజీఎస్ నిధుల కేటాయింపులో ఎమ్మెల్యే కడియం వివక్షపై కమ్మరిపేట సర్పంచ్ జోడుముంతల కిరణ్ నల్లబ్యాడ్జీ ధరించి, కింద కూర్చుని నిరసన తెలిపారు.

దిశ, ధర్మసాగర్: వేలేరు మండలంలోని బీఆర్ఎస్ పార్టీ తరపున గెలిచిన సర్పంచ్‌లకు ఈజీఎస్ నిధుల కేటాయింపులో వివక్షపై మండల సమన్వయ సమావేశంలో కమ్మరిపేట సర్పంచ్ జోడుముంతల కిరణ్ నల్లబ్యాడ్జీ ధరించి, కింద కూర్చుని నిరసన తెలిపారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ... స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి ఇటివలే మండలానికి కేటాయించిన రూ.1 కోటి 30 లక్షల ఈజీఎస్ నిధులు కేవలం కాంగ్రెస్ పార్టీ తరుపున గెలిచిన ఏడుగురు సర్పంచ్‌లకే ఇచ్చి, బీఆర్ఎస్ పార్టీ తరుపున గెలిచిన ఐదుగురు సర్పంచ్‌లకు ఒక్క రూపాయి నిధులు కూడా ఇవ్వకుండా వివక్ష చూపుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తమ గ్రామాలకు వచ్చే నిధులు రాకపోవడం వల్ల గ్రామ అభివృద్ధి కుంటుపడుతుందని అన్నారు. గత ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ తరుపున కడియం శ్రీహరి పోటి చేసినప్పుడు మండలంలోని అన్ని గ్రామాల ప్రజలు ఓట్లు వేసి గెలిపిస్తే ప్రస్తుతం కాంగ్రెస్ పారీ సర్పంచ్‌లకే నిధులు ఇవ్వడమేంటని ప్రశ్నించారు. ఇప్పటికైనా ఎమ్మెల్యే కడియం శ్రీహరి మండలంలోని అన్ని గ్రామాలకు సమానంగా నిధులు కేటాయించి తమ గ్రామాల అభివృద్ధికి కూడా తోడ్పాడాలని కోరారు.






