- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మాలీవుడ్ ఇండస్ట్రీకి భాగ్యశ్రీ బోర్సే ఎంట్రీ.. స్టార్ హీరో సినిమాలో లక్కీ చాన్స్ దక్కించుకున్న బ్యూటీ!
మలయాళ సూపర్ స్టార్ మోహన్‌లాల్ నటిస్తున్న ఒక భారీ బడ్జెట్ సినిమాలో భాగ్యశ్రీ ఒక కీలకమైన పాత్రకు ఎంపికైనట్లు సమాచారం.

దిశ, సినిమా: టాలీవుడ్ యంగ్ హీరోయిన్ భాగ్యశ్రీ బోర్సే చేసిన చిత్రాలన్నీ బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో సక్సెస్ కాలేకపోయాయి. అయినప్పటికీ ఈ భామ క్రేజ్, డిమాండ్ ఏ మాత్రం తగ్గలేదు. టాలీవుడ్‌లో వరుసగా క్రేజీ ఆఫర్లు దక్కించుకుంటూ అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. తెలుగుతో పాటు ‘కాంత’ అనే సినిమాతో తమిళ ఇండస్ట్రీలోకి కూడా అడుగుపెట్టింది. ఇటీవల ‘ఆంధ్రా కింగ్ తాలూకా’ చిత్రంతో ప్రేక్షకులను అలరించిన భాగ్యశ్రీ.. ప్రస్తుతం కోలీవుడ్ స్టార్ శివకార్తికేయన్ సరసన ‘సెయాన్’ సినిమాలో నటిస్తూ ఫుల్ బిజీగా ఉంది. అలాగే తెలుగులో అక్కినేని అఖిల్ నెక్స్ట్ మూవీ ‘లెనిన్’లో హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ క్రమంలోనే భాగ్యశ్రీ బోర్సేకు సంబంధించిన వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. టాలీవుడ్, కోలీవుడ్ తర్వాత ఈ బ్యూటీ ఇప్పుడు మాలీవుడ్ ఇండస్ట్రీలోకి కూడా గ్రాండ్‌గా ఎంట్రీ ఇవ్వబోతున్నట్లు టాక్ నడుస్తోంది.
మలయాళ సూపర్ స్టార్ మోహన్‌లాల్ నటిస్తున్న ఒక భారీ బడ్జెట్ సినిమాలో భాగ్యశ్రీ ఒక కీలకమైన పాత్రకు ఎంపికైనట్లు సమాచారం. టాలెంటెడ్ డైరెక్టర్ విష్ణు మోహన్ దర్శకత్వంలో తెరకెక్కబోతున్న ఒక హై-వోల్టేజ్ సర్వైవల్ థ్రిల్లర్ చిత్రంలో ఆమె నటించనుందనే వార్త నెట్టింట వైరల్ అవుతోంది. ఈ సినిమా కథాంశం చాలా పవర్‌ఫుల్‌గా ఉండబోతోందని తెలుస్తోంది. రష్యా-ఉక్రెయిన్ యుద్ధం జరిగిన సమయంలో అక్కడ చిక్కుకుపోయిన భారతీయ పౌరులను, విద్యార్థులను సురక్షితంగా స్వదేశానికి తీసుకురావడం కోసం భారత ప్రభుత్వం చేపట్టిన అత్యంత ప్రతిష్టాత్మకమైన సీక్రెట్ మిషన్ ఆపరేషన్ గంగ నేపథ్యంలో ఈ సినిమా కథ సాగనుంది. ఇంతటి భారీ దేశభక్తి చిత్రంలో భాగ్యశ్రీ బోర్సేకి ఒక ఇంపార్టెంట్ రోల్ దక్కడం విశేషం. ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ ఆగస్టు మొదటి వారంలో జార్జియాలో ప్రారంభం కానుందని తెలుస్తోంది.






