- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
‘రియల్‌మీ’ నుంచి పవర్‌ఫుల్ ఫోన్: 8,000mAh బ్యాటరీతో ‘P4x 4G’ లాంచ్
రియల్‌మీ నుంచి 8,000mAh భారీ బ్యాటరీతో మరో స్మార్ట్‌ఫోన్ లాంచ్ అయింది.

దిశ, వెబ్‌డెస్క్: ప్రఖ్యాత స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ రియల్‌మీ (Realme) గ్లోబల్ మార్కెట్లోకి సరికొత్త బడ్జెట్ ఫోన్‌ను విడుదల చేసింది. గతేడాది డిసెంబర్‌లో భారత్‌లో విడుదలైన ‘రియల్‌మీ P4x 5G’ మోడల్‌కు కొనసాగింపుగా.. సరికొత్త ఫీచర్లు, బిగ్ బ్యాటరీ కెపాసిటీతో ‘Realme P4x 4G’ వేరియంట్‌ను ఇంటర్నేషనల్ మర్కెట్‌లో లాంచ్ చేసింది. అయితే, ఈ ఫోన్ మెయిన్ స్పెషాలిటీ బ్యాటరీ. ఇందులో ఏకంగా 8,000mAh సామర్థ్యం గల భారీ బ్యాటరీని అమర్చారు. దానిక తోడు 45W సూపర్‌వూక్ (SUPERVOOC) ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ కూడా ఉంది. ఒకసారి ఛార్జ్ చేస్తే రోజులకు తరబడి బ్యాటరీ లైఫ్ ఇస్తుంది.
డిస్‌ప్లే, ప్రాసెసర్ ఇవే..
రియల్‌మీ P4x 4G ఫోన్ 6.8 ఇంచుల హెచ్‌డీ ఎల్‌సీడీ స్క్రీన్‌ను కలిగి ఉంది. ఇది 120Hz రిఫ్రెష్ రేట్, 900 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్‌తో వస్తోంది. స్క్రీన్‌పై కోసం కాస్టింగ్ గొరిల్లా గ్లాస్ ప్రొటెక్షన్‌ను ఇచ్చారు. హ్యాండ్‌సెట్ ఆక్టాకోర్ Unisoc T7250 ప్రాసెసర్‌పై నడుస్తుంది. ఇది లేటెస్ట్ ఆండ్రాయిడ్ 16 రియల్‌మీ యూఐ సాఫ్ట్‌వేర్‌తో పనిచేస్తుంది. ఫొటోగ్రఫీ కోసం వెనుక వైపు f/1.8 అపెర్చర్, ఆటోఫోకస్ సపోర్ట్ ఉన్న 50 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరాను ఇచ్చారు. ముందు భాగంలో f/2.2 అపెర్చర్‌తో ఉన్న 5 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా ఉంది. సైడ్-మౌంటెడ్ ఫింగర్‌ప్రింట్ స్కానర్, ఫేస్ అన్‌లాక్ ఫీచర్లు ఉన్నాయి. వైఫై 5, బ్లూటూత్ 5.2, యూఎస్‌బీ టైప్-సి పోర్ట్, 3.5mm ఆడియో జాక్ వంటి కనెక్టివిటీ ఆప్షన్లు ఉన్నాయి. ప్రస్తుతం ఈ ఫోన్ మలేషియా మార్కెట్లో అందుబాటులోకి వచ్చింది. అక్కడ 4GB RAM + 256GB స్టోరేజ్ బేస్ వేరియంట్ ధర MYR 799 అంటే భారత కరెన్సీలో సుమారు రూ.14వేలుగా ఉంది. హ్యాండ్ సెట్ ర్యాలీ వైట్, ఫాంటమ్ బ్లూ రంగుల్లో లభిస్తుంది.






