మమూళ్లు తీసుకొని పర్మిషన్లు ఇస్తున్నారు

by Ratna Kumari |

కొంతమంది టౌన్ ప్లానింగ్ సిబ్బంది మామూళ్ల మత్తులో ఇష్టారాజ్యంగా బిల్డింగులు కట్టుకునేందుకు అనుమతులు ఇస్తున్నారంటూ మున్సిపల్ కౌన్సిల్ సిబ్బంది ఆగ్రహం వ్యక్తం చేశారు.

మమూళ్లు తీసుకొని పర్మిషన్లు ఇస్తున్నారు
X

దిశ, సంగారెడ్డి : కొంతమంది టౌన్ ప్లానింగ్ సిబ్బంది మామూళ్ల మత్తులో ఇష్టారాజ్యంగా బిల్డింగులు కట్టుకునేందుకు అనుమతులు ఇస్తున్నారంటూ మున్సిపల్ కౌన్సిల్ సిబ్బంది ఆగ్రహం వ్యక్తం చేశారు. మంగళవారం సంగారెడ్డి మున్సిపల్ కార్యాలయంలో చైర్పర్సన్ కూన వనిత సంతోష్, మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్ రెడ్డి ఆధ్వర్యంలో జనరల్ బాడీ సమావేశాన్ని నిర్వహించారు. ఇందులో భాగంగా పట్టణంలో ప్రధానంగా నెలకొన్న సమస్యలపై వారు చర్చించారు. అయితే హెచ్ఎండిఏ అనుమతులు మేరకే ఇంటి నిర్మాణాలు చేపట్టాల్సి ఉండగా కూడా కొందరు మున్సిపల్ టౌన్ ప్లానింగ్ విభాగానికి చెందిన సిబ్బంది డబ్బులు తీసుకుంటూ ఇష్టారాజ్యంగా పర్మిషన్లు ఇచ్చి వారికి సహకరిస్తున్నారని కౌన్సిలర్లు శ్రీకాంత్, జలంధర్, నానీలు ఇతర సభ్యులు మండిపడ్డారు. ఇదిలా ఉంటే రాబోయే వర్షాకాలం దృష్ట్యా పట్టణంలో ప్రజలకు ఇబ్బందులు కలగకుండా తగిన చర్యలు తీసుకోవాలని కౌన్సిల్ సభ్యులు కోరారు.

వార్డుకు రూ.8 కోట్లు ఇంకా ఎప్పుడు ఇస్తారు..?

గత మున్సిపల్ ఎన్నికల్లో వార్డుకు రూ.8 కోట్ల చొప్పున నిధులు ఇస్తామన్న విషయాన్ని ఇటు బీఆర్ఎస్, అటు కాంగ్రెస్ కౌన్సిలర్లు చైర్పర్సన్ దృష్టికి తీసుకువచ్చారు. ఇచ్చిన హామీ మేరకు వార్డుకి రూ.8 కోట్ల నిధులను ఇంకా ఎప్పుడు ఇస్తారని ప్రశ్నించారు. ఈ సందర్భంగా చైర్పర్సన్ వనిత మాట్లాడుతూ జగ్గారెడ్డి, నిర్మల సహకారంతో ముఖ్యమంత్రి ద్వారా త్వరలోనే ఆ నిధులు వచ్చేలా చూస్తామని చెప్పారు.

రూ.20 లక్షల కేటాయింపు..

రాబోయే వర్షాకాలాన్ని దృష్టి పెట్టుకుని రోడ్లు బురదమయం కాకుండా అందుకు తగ్గ ఏర్పాట్లు చేసేందుకు రూ.20 లక్షలు కేటాయించడం జరుగుతుందని మున్సిపల్ చైర్ పర్సన్ వనిత స్పష్టం చేశారు. ఈ నిధులతో శానిటేషన్, స్ట్రీట్ లైట్ ఇతర పనులను కూడా ఎప్పటికప్పుడు పూర్తి చేయడం జరుగుతుందన్నారు. రాబోయే రోజుల్లో పట్టణంలో నెలకొన్న అన్ని సమస్యలను పరిష్కరిస్తామని ఆమె సభ్యులకు ఈ సందర్భంగా హామీ ఇచ్చారు. ఈ సమావేశంలో మున్సిపల్ వైస్ చైర్మన్ షఫీ, వార్డు కౌన్సిలర్లు, కోఆప్షన్స్ సభ్యులు ఇతర సిబ్బంది పాల్గొన్నారు.

Next Story