- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Oracle: ఏడాదిలో 21,000 మంది ఉద్యోగులకు గుడ్‌బై చెప్పిన ఒరాకిల్
గత 12 నెలల్లో కంపెనీ ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఉద్యోగుల్లో సుమారు 21,000 మందిని తగ్గించింది.

దిశ, బిజినెస్ బ్యూరో: ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) ఉద్యోగాలపై కార్పొరేట్ కంపెనీలపై తీవ్ర ప్రభావం చూపుతోంది. ఇప్పటికే పలు దిగ్గజ సంస్థలు పెద్ద ఎత్తున ఉద్యోగాల కోత చేపట్టగా, తాజాగా ప్రముఖ టెక్ దిగ్గజం ఒరాకిల్ భారీగా ఉద్యోగులను తొలగించింది. గత 12 నెలల్లో కంపెనీ ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఉద్యోగుల్లో సుమారు 21,000 మందిని తగ్గించింది. తాజా వార్షిక ఆర్థిక నివేదికలో కంపెనీ స్వయంగా వెల్లడించిన వివరాల ప్రకారం, ఏఐ టెక్నాలజీలను సంస్థ కార్యకలాపాల్లో విస్తృతంగా వినియోగించడం వల్ల ఉద్యోగుల సంఖ్య తగ్గిందని, భవిష్యత్తులో కూడా ఇలాంటి మార్పులు కొనసాగే అవకాశం ఉందని స్పష్టం చేసింది. దీంతో 2024 మే చివరినాటికి 1,62,000 మంది ఉన్న ఉద్యోగుల సంఖ్య, 2025 మే చివరికి 1,41,000కు పడిపోయింది. ఈ పునర్వ్యవస్థీకరణ చర్యల కారణంగా కంపెనీకి సుమారు 1.8 బిలియన్ డాలర్ల(రూ. 17 వేల కోట్లకు పైగా) అదనపు ఖర్చు కూడా వచ్చింది.
మరోవైపు, ఓపెన్ఏఐ వంటి కస్టమర్ల కోసం భారీ ఏఐ డేటా సెంటర్ల నిర్మాణంలో ఒరాకిల్ పెట్టుబడులు పెడుతోంది. ఈ ఖర్చుల ఒత్తిడిని తగ్గించేందుకు సంస్థ ఉద్యోగులకు అయ్యే ఖర్చులను కుదించే దిశగా అడుగులు వేసినట్లు పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి. ప్రస్తుతం ఒరాకిల్‌లో సుమారు 49,000 మంది అమెరికాలో, మరో 92,000 మంది ఇతర దేశాల్లో పనిచేస్తున్నారు. 2022లో 28 బిలియన్ డాలర్లతో కొనుగోలు చేసిన సర్నర్ ద్వారా వేలాది మంది ఉద్యోగులు చేరినప్పటికీ, ఇప్పుడు మొత్తం ఉద్యోగుల సంఖ్య ఆ కొనుగోలుకు ముందు స్థాయికంటే కూడా ఇంకా తక్కువగా ఉండటం గమనార్హం.






