- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
దిశ ఎఫెక్ట్...విద్యుత్ శాఖలో కుంభకోణంపై స్పందించిన యంత్రాంగం
అవినీతిపై కుంభకోణాలపై తనిఖీలు నిర్వహించి చర్యలు తీసుకుంటామని విద్యుత్ ఎస్సీ నవీన్ కుమార్ తెలిపారు.

దిశ, మక్తల్: మక్తల్ విద్యుత్ శాఖలో జరిగిన అవినీతిపై కుంభకోణాలపై తనిఖీలు నిర్వహించి చర్యలు తీసుకుంటామని విద్యుత్ ఎస్సీ నవీన్ కుమార్ తెలిపారు. ప్రస్తుతం సబ్ స్టేషన్ లో సిబ్బంది కొరత తీవ్రంగా ఉందని, ఇక్కడ పని చేయాల్సిన 9 మంది సిబ్బంది డిప్యూషన్ పై జిల్లా కేంద్రంలో పనిచేస్తున్నారని ఆయన అన్నారు. నారాయణపేటజిల్లాలో డిప్యూటేషన్లపై పని చేస్తున్నారని వెల్లడించారు. మక్తల్ విద్యుత్ శాఖలో జరుగుతున్న కుంభకోణాలపై స్తంభాల మధ్యన వేలాతున్న విద్యుత్ తీగలను సరి చేయకపోవడం వల్ల నిండు ప్రాణాలు బలి అయ్యాయి. విద్యుత్ శాఖలో ట్రాన్స్ ఫార్మార్లు, వైర్ల అవినీతి జరుగుతున్నాదని దిశ పత్రికలో కథనాలు రావడంతో ఎస్సీ నవీన్ కుమార్ స్పందించారు. ఈ తరుణంలోనే దిశతో మాట్లాడుతూ అవినీతి ఎక్కడ జరిగిన సహించేది లేదని పేర్కొన్నారు. రైతులను వేధించిన సంబంధిత కాంట్రాక్టర్లపై చర్యలు తీసుకుంటామని, దరఖాస్తు చేసుకున్న కనెక్షన్స్ ఇస్తామన్నారు. కరెంట్ సమస్యలు ఏవైనా ఉంటే తమ దృష్టికి తీసుకొస్తే, పరిష్కరిస్తామని రైతులకు ఎస్సీ నవీన్ కుమార్ హామీ ఇచ్చారు.






