హత్యకు ప్రతీకార హత్య...

by Kodari Anjali |

చిన్న శంకరంపేట మండలం సూరారం గ్రామంలో రెండు హత్యల కలకలం రేపుతోంది.

హత్యకు ప్రతీకార హత్య...
X

దిశ, వెల్దుర్తి: చిన్నశంకరంపేట హత్యకు ప్రతీకార హత్య చేయడంతో చిన్న శంకరంపేట మండలం సూరారం గ్రామంలో పోలీసు పీకేటింగ్ ఏర్పాటు చేశారు. సోమవారం పాత కక్షలు నేపథ్యంలో ఓ వ్యక్తిని ఆటో ఢీకొట్టి యువకుడి హత్యకు పాల్పడగా, ప్రతీకార చర్యగా సోమవారం రాత్రి మరో వ్యక్తిని వెల్దుర్తి మండలంలో హతమార్చి హల్దీ ప్రాజెక్టులో వేసిన సంఘటన చోటుచేసుకుని గ్రామంలో ఉద్రికత నెలకొంది. పాత కక్షలతో రెండు హత్యలు జరిగి ఉన్నట్లు తెలుస్తుంది. వివరాలకు వెళ్తే... అదే గ్రామానికి చెందిన మృతుడు యాట శ్రీధర్ వరుసకు చెల్లిని గత 15 రోజుల క్రితం పెళ్లి చేసుకున్నాడు. ఈ నేపథ్యంలోనే రెండు కుటుంబాల మధ్యలో కక్షలు పెరిగినట్లు తెలుస్తుంది. గతంలో కూడా మృతుడు యాటశ్రీధర్‌కి, ప్రభాకర్‌కు ఆటో విషయంలో గొడవ జరిగి కత్తితో దాడి చేసినట్లు సమాచారం.

విచారణలో గుర్తించిన వెల్దుర్తి పోలీసులు..

ఈ నేపథ్యంలో నిందితుడు ప్రభాకర్ పై చిన్నశంకరంపేట పోలీస్ స్టేషన్లో అటెంప్ట్ మర్డర్ కేసు నమోదు అయినట్లు తెలుస్తుంది. శ్రీధర్ కుటుంబానికి న్యాయం జరిగే వరకు మృతదేహాన్ని తీయమని పోలీసులతో వాగ్వాదానికి దిగారు. తూప్రాన్ డి.ఎస్.పి నరేందర్ గౌడ్ శ్రీధర్ మృతి దేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తూప్రాన్ ప్రభుత్వ ఆసుపత్రికి పంపించారు. దీంతో ప్రభాకర్ తండ్రి యాదగిరి యాట శ్రీధర్ బంధువులకు రాత్రి తరాసపడగా.. రణబోయిన యాదగిరిని హత్య చేసి మాసాయిపేట మండలం అక్కంపేట హల్దీ డ్యాంలో వేసినట్లు తెలిసింది. విచారణలో గుర్తించిన వెల్దుర్తి పోలీసులు యాదగిరి మృతదేహాన్నిపోస్టుమార్టం నిమిత్తం నర్సాపూర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినట్లు తెలిసింది. గ్రామంలో రెండు హత్యలతో ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. రెండు శవాలను పూడ్చి పెట్టేందుకు ప్రజలు గందరగోళం పడుతున్నారు. ఎప్పుడు ఏమైతుందో అనే పరిస్థితి నెలకొంది.

Next Story