- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
రైతుకు దిమ్మ తిరిగే షాక్ ఇచ్చిన అధికారులు
కొనుగోలు కేంద్రానికి వచ్చిన ధాన్యం సక్రమంగా ఉంటేనే కాంటాలు వేయడం సర్వసాధారణం.

దిశ, తుంగతుర్తి : కొనుగోలు కేంద్రానికి వచ్చిన ధాన్యం సక్రమంగా ఉంటేనే కాంటాలు వేయడం సర్వసాధారణం. అనంతరం సంబంధిత మిల్లుల వద్దకు అధికారులు పంపడం అక్కడ దిగుమతులు జరగడం లాంటివి కూడా సాధారణమే. అయితే ఇక్కడ మాత్రం అధికారులతో పాటు సంబంధిత మిల్లు యాజమాన్యం ఓ రైతుకు దిమ్మతిరిగే షాక్ ఇచ్చారు. దీంతో ఏమి చేయాలో తెలియక సొంతూరు కొచ్చి విలేకరుల ముందు గోడును వెళ్లబోసుకున్నారు ఆ రైతు. సూర్యాపేట జిల్లా తుంగతుర్తి మండలం రావులపల్లి గ్రామానికి చెందిన కసరబోయిన కిష్టయ్య 129 బస్తాల ధాన్యాన్ని గ్రామంలో ఏర్పాటైన కొనుగోలు కేంద్రం ద్వారా తూకం వేశారు. అనంతరం కేంద్ర నిర్వాహకులు మరి కొంతమంది రైతుల ధాన్యంతో కలిసి మొత్తంగా లారీలో నేరేడుచర్లలోని రైస్ మిల్లుకు దిగుమతికి పంపారు.
అక్కడ నాలుగైదు రోజుల వరకు దిగుమతి కాలేదు. అనంతరం అధికారులు మరో మిల్లుకు పంపినప్పటికీ ఇక్కడ కూడా జాప్యమే ఏర్పడింది. అనంతరం ధాన్యం తడిసిందనే కారణం పై వచ్చిన 129 బస్తాల్లో 50 బస్తాలను తరుగు తీశాకే దిగుమతి చేసుకుంటామంటూ ఖరాఖండిగా ఓ పిడుగులాంటి వార్త రైతుకు చేరవేశారు. అలాగే మరో 10 కిలోలు ఇతర తరుగుల కింద తీస్తామంటూ చెప్పుకొచ్చారు. అంతేకాకుండా తుంగతుర్తి మండలానికి చెందిన ఐకేపీ అధికారులు కూడా ఇదే విషయాన్ని చెప్పారంటూ బాధిత రైతు కృష్ణయ్య పేర్కొన్నారు. దీంతో దిక్కుతోచని స్థితిలో మిగతా రైతుల ఒత్తిడి మేరకు తలొగ్గాల్సి వచ్చిందని తన గోడును వెల్లబోసుకున్నారు. తడిసిన ధాన్యం గింజను సైతం కొంటామంటూ ఓవైపు ప్రభుత్వం స్పష్టంగా చెబుతుంటే మరోవైపు అధికారులు, సంబంధిత మిల్లుల దోబూచులాటలో రైతులు తీవ్రస్థాయిలో నష్టపోతున్న తీరు దీనికి ఉదాహరణగా పేర్కొనవచ్చు.






