11 ఏళ్ల తర్వాత హిట్ కాంబో రిపీట్..

by Mallepaka Hamsa |

నివిన్ పౌలీ నటిస్తున్న మైల్‌స్టోన్ మూవీ, ఆయన కెరీర్‌లోని 50వ ప్రాజెక్ట్ బాధ్యతలను ఆల్ఫాన్స్ పుత్రేన్ చేతిలో పెట్టినట్లు టాక్.

11 ఏళ్ల తర్వాత హిట్ కాంబో రిపీట్..
X

దిశ, సినిమా: మలయాళ చిత్ర పరిశ్రమలో క్లాసిక్ లవ్ స్టోరీగా నిలిచిపోయిన ‘ప్రేమమ్’ సినిమా ఎంతటి సంచలనాలు సృష్టించిందో అందరికీ తెలిసిందే. మలయాళ స్టార్ హీరో నివిన్ పౌలీ, దర్శకుడు ఆల్ఫాన్స్ పుత్రేన్ కాంబినేషన్‌లో 2015లో వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీసు వద్ద రికార్డులు క్రియేట్ చేసింది. అయితే ఈ సినిమా ద్వారానే సాయి పల్లవి, అనుపమ పరమేశ్వరన్, మడోన్నా సెబాస్టియన్ హీరోయిన్లుగా పరిచయమయ్యారు. కేవలం రూ. 4 కోట్ల స్వల్ప బడ్జెట్‌తో తెరకెక్కిన ‘ప్రేమమ్’.. బాక్సాఫీస్ వద్ద ఏకంగా రూ. 75 కోట్లు వసూలు చేసి అందరినీ ఆశ్చర్యపరిచింది. నివిన్ పౌలీ కెరీర్‌లోనే అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రాల్లో ఒకటిగా నిలిచింది. ఈ ఇండస్ట్రీ హిట్ సినిమా విడుదలై అప్పుడే 11 ఏళ్లు పూర్తి కావస్తోంది. అయితే ఈ సుదీర్ఘ విరామం తర్వాత ఈ క్రేజీ కాంబినేషన్ మళ్లీ సెట్స్ పైకి వెళ్లేందుకు సిద్ధమైంది.

తాజాగా, ఇందుకు సంబంధించిన పోస్టులు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. దర్శకుడు ఆల్ఫాన్స్ పుత్రేన్‌కు నివిన్ పౌలీ మరో అద్భుతమైన అవకాశాన్ని ఇచ్చారట. నివిన్ పౌలీ నటిస్తున్న మైల్‌స్టోన్ మూవీ, ఆయన కెరీర్‌లోని 50వ ప్రాజెక్ట్ బాధ్యతలను ఆల్ఫాన్స్ పుత్రేన్ చేతిలో పెట్టినట్లు టాక్. వీరిద్దరి కాంబోలో సినిమా అనగానే మలయాళ ఇండస్ట్రీతో పాటు సౌత్ సినీ వర్గాల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ ప్రతిష్టాత్మక చిత్రానికి సంబంధించిన ఒక క్రేజీ అప్‌డేట్ ఇప్పుడు సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది. ఈ సినిమా టైటిల్‌ను జూన్ 27న అధికారికంగా ప్రకటించనున్నట్లు టాక్. ఒకవైపు నివిన్ పౌలీ 50వ సినిమా కావడం, మరోవైపు ‘ప్రేమమ్’ లాంటి ఇండస్ట్రీ హిట్ ఇచ్చిన డైరెక్టర్ కావడంతో ఈ ప్రాజెక్ట్‌పై ప్రేక్షకుల్లో విపరీతమైన ఆసక్తి నెలకొంది. ఈ జూన్ 27న రాబోయే టైటిల్ అనౌన్స్‌మెంట్ కోసం అటు నివిన్ పౌలీ అభిమానులతో పాటు లవ్‌స్టోరీస్ ఇష్టపడేవారు ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు.

Next Story