విజయ్ దేవరకొండ అభిమానులకు షాకింగ్ న్యూస్.. ‘రణబాలి’ విడుదల వాయిదా?

by Mallepaka Hamsa |

తాజా సమాచారం ప్రకారం.. ‘రణబలి’ సినిమా సెప్టెంబర్ 11న విడుదల వాయిదా పడనుందని టాక్.

విజయ్ దేవరకొండ అభిమానులకు షాకింగ్ న్యూస్.. ‘రణబాలి’ విడుదల వాయిదా?
X

దిశ, సినిమా: టాలీవుడ్ రౌడీ హీరో విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న జంటగా నటిస్తున్న మోస్ట్ అవైటెడ్ మూవీ ‘రణబలి’. ఈ క్రేజీ జోడీ పెళ్లైన తర్వాత కలిసి నటిస్తున్న మొదటి సినిమా కావడంతో ప్రేక్షకుల్లో భారీ హైప్ క్రియేట్ అయింది. టాక్సీవాలా, శ్యామ్ సింగ రాయ్ వంటి వైవిధ్యమైన కథలను అందించిన దర్శకుడు రాహుల్ సంకృత్యన్ దర్శకత్వంలో రాబోతున్న ఈ ప్రతిష్టాత్మక పీరియాడిక్ యాక్షన్ డ్రామాను మైత్రీ మూవీ మేకర్స్, టిసిరీస్ బ్యానర్స్‌పై నిర్మిస్తున్నారు. ఈ సినిమా కథాంశం చాలా ఆసక్తికరంగా ఉండబోతోంది. 1854 నుండి 1878 మధ్య కాలంలో జరిగిన రాయలసీమ కరువు మరియు బ్రిటిష్ పాలన నేపథ్యంలో సాగే ఒక పవర్‌ఫుల్ విప్లవాత్మక కథతో ‘రణబలి’ ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. అయితే, మూవీ మేకర్స్ ఈ సినిమాను సెప్టెంబర్ 11న ప్రపంచవ్యాప్తంగా భారీ స్థాయిలో విడుదల చేయనున్నట్లు అధికారికంగా అనౌన్స్ చేసిన విషయం తెలిసిందే.

దీంతో విజయ్, రష్మిక ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడు థియేటర్లలో ఈ విజువల్ వండర్‌ను చూద్దామా అని ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. కానీ అనుకొని విధంగా ఈ చిత్రం వాయిదా పడినట్లు తెలుస్తోంది. తాజా సమాచారం ప్రకారం.. ‘రణబలి’ సినిమా సెప్టెంబర్ 11న విడుదల వాయిదా పడనుందని టాక్. ఈ మూవీకి సంబంధించిన విజువల్ ఎఫెక్ట్స్, పోస్ట్ ప్రొడక్షన్ పనులు పూర్తి కావడానికి మరికొంత సమయం పట్టేలా ఉందని, అందుకే సినిమాను వాయిదా వేసే ఆలోచనలో చిత్ర యూనిట్ ఉన్నట్లు తెలుస్తోంది. సెప్టెంబర్ మిస్ అయితే, కొత్త విడుదల తేదీగా దసరా పండగ సీజన్‌ను టార్గెట్ చేస్తూ.. అక్టోబర్ నెలలో ఈ చిత్రాన్ని రిలీజ్ చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్లు టాక్. ఒకవేళ ఇదే నిజమైతే రౌడీ ఫ్యాన్స్‌కు ఇది కాస్త నిరాశ కలిగించే విషయమే అయినప్పటికీ, అవుట్‌పుట్ అద్భుతంగా రావడం కోసమే చిత్రబృందం ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు సమాచారం. అయితే దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

Next Story