- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
బాసర ఆలయ చోరీకి 'రేవంతుద్దీన్' ప్రభుత్వ నిర్లక్ష్యమే కారణం: బీజేపీ
బాసర ఆలయ హుండీ చోరీపై తెలంగాణ బీజేపీ ఫైర్.. హిందువుల మనోభావాలను గాలికొదిలేసిన రేవంత్ ప్రభుత్వానికి అధికారంలో ఉండే హక్కు లేదని ట్వీట్!

దిశ, వెబ్ డెస్క్: తెలంగాణ రాష్ట్రంలోని ప్రముఖ పుణ్య క్షేత్రాలలో ఒకటైన బాసర జ్ఞాన సరస్వతి దేవి ఆలయంలో సోమవారం రాత్రి దొంగలు పట్టారు. చాకచక్యంగా గుడి లోకి ప్రవేశించిన ఇద్దరు దొంగలు సీసీ కెమెరాలపై గుడ్డలు కప్పి అమ్మవారి నగలు, వెండి కిరీటం, హుండీ ఎత్తుకెళ్లారు. ఈ ఘటనతో యావత్ తెలంగాణ ఒక్కసారిగా ఉలిక్కిపడింది. కాగా ప్రముఖ పుణ్యక్షేత్రం లో జరిగిన ఈ భారీ దోపిడిపై బీజేపీ పార్టీ తీవ్రంగా స్పందించింది. ఎక్స్ వేదికగా ఆగ్రహం వ్యక్తం చేస్తూ. 'రేవంతుద్దీన్' ప్రభుత్వ నిర్లక్ష్యమే కారణమంటూ ట్వీట్ చేసింది.
హిందువుల నమ్మకం పై జరిగిన దాడి..
రాష్ట్రంలో దేవాలయాలకు, దేవుడి సొమ్ముకు కనీస రక్షణ కల్పించలేని కాంగ్రెస్ ప్రభుత్వం, ఇక సామాన్య ప్రజలకు ఎలాంటి భరోసా ఇస్తుందని బీజేపీ నిలదీసింది. బాసర లాంటి చారిత్రాత్మక పుణ్యక్షేత్రంలో ఆరుగురు సిబ్బంది నైట్ డ్యూటీలో ఉన్నప్పటికీ ఈ దొంగతనం జరగడం కేవలం సాధారణ చోరీ కాదని.. ఇది కోట్ల మంది హిందూ భక్తుల మనోభావాలపై, వారి నమ్మకంపై జరిగిన ప్రత్యక్ష దాడి అని పార్టీ మండిపడింది. పవిత్రమైన గుడి హుండీకే గండి కొట్టేంత ధైర్యం దొంగలకు ఎక్కడి నుంచి వచ్చిందని ప్రశ్నిస్తూ.. ఇది ముమ్మాటికీ ప్రభుత్వ అధికారుల వైఫల్యమేనని, హిందువుల మనోభావాలను, ఆలయాల భద్రతను పూర్తిగా గాలికొదిలేసిన ఈ నిర్లక్ష్యపు కాంగ్రెస్ ప్రభుత్వానికి అసలు అధికారంలో కొనసాగే నైతిక హక్కు లేదని బీజేపీ తమ పోస్ట్‌లో స్పష్టం చేసింది. బాసర ఆలయ భద్రతా వైఫల్యాలపై తక్షణమే విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసింది.






