- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
బిహార్ ఎన్‌కౌంటర్‌పై దేశవ్యాప్త చర్చ.. అసలు ఎవరీ భరత్ భూషణ్ తివారీ!
బిహార్‌లోని భోజ్‌పూర్ జిల్లాల్లో సోషల్ మీడియా యాక్టివిస్ట్, యువకుడు భరత్ భూషణ్ తివారీ (28) పోలీస్ ఎన్ కౌంటర్‌లో మరణించిన ఘటన ఇప్పుడు దేశవ్యాప్తంగా పెను సంచలనంగా మారింది.

దిశ, వెబ్‌డెస్క్: బిహార్‌లోని భోజ్‌పూర్ జిల్లాల్లో సోషల్ మీడియా యాక్టివిస్ట్, యువకుడు భరత్ భూషణ్ తివారీ (28) పోలీస్ ఎన్ కౌంటర్‌లో మరణించిన ఘటన ఇప్పుడు దేశవ్యాప్తంగా పెను సంచలనంగా మారింది. ఎలాంటి నేరచరిత్ర లేని, ప్రజా సమస్యలపై నిరంతరం ప్రశ్నించే ఒక యువకుడ్ని పోలీసులు కాల్చి చంపడంపై ప్రజలు, ప్రతిపక్షాలు, హక్కుల సంఘాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. శాంతిభద్రతల పరిరక్షణ పేరుతో పోలీసులు జరిపిన ఈ 'ఫేక్ ఎన్ కౌంటర్' పై విమర్శలు వెల్లువెత్తడంతో, బిహార్ ప్రభుత్వం ఎట్టకేలకు దిగివచ్చి హైకోర్టు రిటైర్డ్ న్యాయమూర్తి నేతృత్వంలో ఉన్నత స్థాయి న్యాయ విచారణ (Judicial inquiry)కు ఆదేశించింది. అలాగే, స్థానిక స్టేషన్ హౌస్ ఆఫీసర్ (SHO)తో సహా నలుగురు పోలీస్ సిబ్బందిని సస్పెండ్ చేసింది.
అసలేం జరిగింది?
భోజ్‌పూర్ జిల్లా షాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బిలౌటి గ్రామానికి చెందిన భరత్ భూషణ్ తివారీ.. గ్రామంలోని రోడ్ల దుస్థితి, వరద బాధితుల సమస్యలు, స్థానిక అవినీతిపై సోషల్ మీడియా వేదికగా గళమెత్తుతూ ప్రజల్లో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. అయితే, జూన్ 17న స్థానిక పోలీసులతో పాటు స్పెషల్ టాస్క్ ఫోర్స్ (STF) సిబ్బంది అతడిని చుట్టుముట్టారు. ఆ సమయంలో జరిగిన కాల్పుల్లో భరత్ మోకాళ్లు, తొడ భాగంలో నాలుగు బుల్లెట్లు దిగడంతో, పాట్నా మెడికల్ కాలేజ్ హాస్పిటల్లో చికిత్స పొందుతూ అతడు ప్రాణాలు కోల్పోయాడు.
ఎన్ కౌంటరా? ముందస్తు ప్రణాళికాబద్ధమైన హత్యనా?
భరత్ తివారీ తమపై కాల్పులు జరపడంతో ఆత్మరక్షణ కోసమే తాము ఎదురుకాల్పులు జరిపామని పోలీసులు వాదిస్తున్నారు. కానీ, ఘటనకు కొద్ది నిమిషాల ముందు భరత్ ఫేస్బుక్ లైవ్ ద్వారా రికార్డ్ చేసిన వీడియోలు ఇప్పుడు పోలీసుల వాదనను పూర్తిగా తలకిందులు చేస్తున్నాయి. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోల ప్రకారం.. భరత్ ఒక బహిరంగ మైదానంలో నిలబడి, తన చేతిలోని పిస్టల్‌ను పోలీసుల వైపు విసిరేసి లొంగిపోతున్నట్లు స్పష్టంగా కనిపిస్తోంది. నిరాయుధుడిగా మారిన తర్వాత కూడా పోలీసులు అతడిని టార్గెట్ చేసి కాల్చారని కుటుంబ సభ్యులు, గ్రామస్థులు ఆరోపిస్తున్నారు. తాను ప్రాణాలతో తిరిగి రానని ముందే ఊహించిన భరత్.. తన మరణానంతరం శరీర అవయవాలను దానం చేయాలంటూ ఎన్ కౌంటర్ కంటే ముందే చేసిన వీడియో అందరినీ కంటతడి పెట్టిస్తోంది.
సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న అంత్యక్రియలు..
భరత్ భూషణ్ తివారీ అంత్యక్రియల వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి. అన్యాయంగా ప్రాణాలు కోల్పోయిన ఆ యువకుడికి నివాళులర్పించేందుకు, ప్రభుత్వ వైఖరికి నిరసన తెలిపేందుకు వేలాది మంది ప్రజలు. యువకులు అంత్యక్రియలకు తరలివచ్చారు. "ప్రజల గొంతుకను నొక్కేందుకే ఈ హత్య చేశారు" అంటూ సోషల్ మీడియా వేదికగా నెటిజన్లు దేశవ్యాప్త నిరసనలు తెలుపుతున్నారు.
సుప్రీంకోర్టుకు చేరిన వివాదం..
ఈ వివాదం తీవ్రరూపం దాల్చడంతో ప్రతిపక్ష నేత తేజస్వీ యాదవ్ ఆర్జేడీ తరఫున ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఎన్డీఏ ప్రభుత్వంలోని భాగస్వామ్య పక్షాలు, బీజేపీ నేతలు సైతం పోలీసుల వైఖరిని తప్పుబట్టారు. ఈ ఎన్ కౌంటర్ సుప్రీంకోర్టు పర్యవేక్షణలో సీబీఐ (CBI) విచారణ జరిపించాలని, బాధ్యులైన పోలీసులపై ఐపీసీ సెక్లీన్ 302 కింద హత్య కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేస్తూ సుప్రీంకోర్టులో ఒక పిటిషన్ కూడా దాఖలైంది. సమాజానికి తప్పుడు సంకేతాలు వెళ్లేకుండా ఉండాలంటే ఈ ఘటనకు కారణమైన ప్రతి ఒక్కరిపై కఠిన చర్యలు తీసుకోవాలని విపక్షాలు ముక్తకంఠంతో డిమాండ్ చేస్తున్నాయి.






