- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కాబోయే భార్యే తోసేసింది!.. యువ వ్యాపారవేత్త మృతి కేసులో BIG ట్విస్ట్
by Prasad Jukanti |
పుణె సమీపంలోని లోహగఢ్ కోట వద్ద యువ వ్యాపారవేత్త కేతన్ విశాల్ మృతి కేసులో ఊహించని ట్విస్ట్ వెలుగు చూసింది.

X
దిశ, డైనమిక్ బ్యూరో: మహారాష్ట్రలోని ప్రముఖ పర్యాటక ప్రాంతమైన లోనవాలా సమీపంలోని లోహగఢ్ కోట వద్ద కొండపై నుంచి జారిపడి మరణించిన యువ వ్యాపారవేత్త కేతన్ విశాల్ మృతి కేసులో ఊహించని ట్విస్ట్ వెలుగు చూసింది. అతడు కొండపై నుంచి జారి పడలేదని తనకు కాబోయే భార్యే ఆమె మరో స్నేహితుడి సహాయంతో కొండ పై నుంచి తోసేసి హత్య చేసినట్లు పోలీసుల భావిస్తున్నారు. ఈ కేసు ప్రాథమిక విచారణలో వెలుగు చూసిన కీలక ఆధారాలను బట్టి ఇవాళ ఉదయం పూణే రూరల్ పోలీసులు కేతన్ కాబోయే భార్యను అతడి స్నేహితుడిని అరెస్టు చేశారు. దీంతో ఈ ప్రమాదవశాత్తు జరిగిన మరణంగా నమోదైన ఈ కేసు ఇప్పుడు హత్య కేసుగా మారింది. మరి కొన్ని నెలల్లో పెళ్లి పీటలు ఎక్కాల్సిన తమ బిడ్డ ఇలా కాబోయే భార్య చేతిలో బలి అయ్యాడనే విషయంతో అంతా షాక్ కు గురవుతున్నారు.
కొండపై నాటకం?
పుణేలోని గహుంజే ప్రాంతానికి చెందిన కేతన్ విశాల్ అగర్వాల్ (26) తమ కుటుంబానికి చెందిన ఓ రియల్ ఎస్టేట్ సంస్థకు డైరెక్టర్‍గా వ్యవహరిస్తున్నారు. విశాల్‍కు ఇటీవల వివాహం కుదిరింది. ఈ ఏడాది చివర్లో ఘనంగా వివాహం జరిపించేందుకు అతడి కుటుంబ సభ్యులు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఈ క్రమంలో జూన్ 18వ తేదీన అతడికి కాబోయే భార్య పుట్టిన రోజు కావడంతో ఆమెతో పాటు మరికొంత మంది స్నేహితులతో కలిసి లోహగఢ్ కోటకు విహారానికి వెళ్లారు. అక్కడ 350 నుంచి 400 అడుగుల ఎత్తైన కొండపై సరదాగా గడిపారు. ఈ క్రమంలో అక్కడ ఫోటోలు తీస్తుండగా కేతన్ ప్రమాదవశాతు కాలు జారి లోయలో పడిపోయాడని అతడికి కాబోయే భార్య నమ్మించిందని పోలీసులు అనుమానిస్తున్నారు. ఆమె కిందకు తోసేయడంతో కేతన్ మృతిచెందినట్లు పుణె పోలీసులు భావిస్తున్నారు. ఈ మేరకు ఆమెను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నట్లు వెల్లడించారు.
Next Story





