- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
హిమాయత్‌నగర్‌లో ఆర్టీసీ బస్సు ఢీకొని గుర్తుతెలియని వ్యక్తి మృతి...
హిమాయత్‌నగర్ మెయిన్ రోడ్డులో మంగళవారం అర్ధరాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ గుర్తు తెలియని వ్యక్తి మృతి చెందాడు.

దిశ, రాంనగర్ : హిమాయత్‌నగర్ మెయిన్ రోడ్డులో మంగళవారం అర్ధరాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ గుర్తు తెలియని వ్యక్తి మృతి చెందాడు. పోలీసుల వివరాల ప్రకారం, జూన్ 23 రాత్రి సుమారు 11:45 గంటలకు క్రీమ్ స్టోన్ సమీపంలో రోడ్డు ప్రమాదం జరిగినట్లు, డయల్-100 ద్వారా సమాచారం అందడంతో పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్నారు. దీంతో అక్కడ తీవ్ర గాయాలతో రోడ్డుపై పడి ఉన్న ఓ వ్యక్తిని గుర్తించారు. ఇదే సమయంలో సంఘటనా స్థలానికి చేరుకున్న 108 అంబులెన్స్ సిబ్బంది అతడిని పరీక్షించి అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు. మృతుడి వయస్సు సుమారు 55 నుంచి 60 సంవత్సరాల మధ్య ఉంటుందని పోలీసులు తెలిపారు. అతని గుర్తింపును తెలుసుకునేందుకు పరిసర ప్రాంతాల్లో విచారణ చేపట్టినప్పటికీ ఎలాంటి సమాచారం లభించలేదు. విచారణలో, కాళీ మందిర్ నుంచి రామ్‌నగర్ గుండు వైపు వెళ్తున్న ముషీరాబాద్ డిపోకు చెందిన 6ఆర్‌కే రూట్ ఆర్టీసీ బస్సు క్రీమ్ స్టోన్ సమీపానికి చేరుకున్న సమయంలో మృతుడు రోడ్డు దాటుతుండగా బస్సు ఢీ కొట్టినట్లు వెలుగులోకి వచ్చింది. ప్రమాదంలో వ్యక్తి రోడ్డుపై పడిపోయి తీవ్ర గాయాల కారణంగా అక్కడికక్కడే మృతి చెందినట్లు, పోలీసులు పేర్కొన్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి, మృతుడి గుర్తింపు కోసం ప్రయత్నాలు కొనసాగిస్తున్నట్లు దోమలగూడ సిఐ అంజత్ అలీ తెలిపారు. ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలపై దర్యాప్తు కొనసాగుతోంది.






