9 అడుగుల పాము కలకలం

by velandi.Saikiran |   (  Updated:2026-06-24 12:57:46  IST  )

మెట్ పల్లి పట్టణంలోని ఓ పండ్ల బండిలో పాము ప్రత్యక్షమవడం స్థానికంగా కల‌కలం రేపింది.

9 అడుగుల పాము కలకలం
X

దిశ, మెట్ పల్లి : మెట్ పల్లి పట్టణంలోని ఓ పండ్ల బండిలో పాము ప్రత్యక్షమవడం స్థానికంగా కల‌కలం రేపింది. పట్టణంలోని పాత బస్టాండ్ వద్ద ఓ వ్యక్తి పండ్ల షాప్ నిర్వహిస్తున్న క్రమంలో ఓ కాటన్ డబ్బాలో బుధ‌వారం దాదాపు 9 అడుగుల పాము ప్ర‌త్య‌క్ష‌మైంది. దీంతో స్థానికంగా ఉన్న వాళ్లు భ‌య‌ బ్రాంతులకు గురయ్యారు. అనంత‌రం ఆ పామును అక్క‌డ వాళ్లే, సంచిలో వేశారు. ఈ సంఘ‌ట‌న‌పై ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.

Next Story