- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
సీఎం రేవంత్‌కు హైకోర్టులో బిగ్ రిలీఫ్.. కీలక కేసు కొట్టివేత
హుజూరాబాద్ ఉపఎన్నికల నాటి కేసుల నుంచి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి విముక్తి లభించింది.

దిశ, వెబ్‌డెస్క్: సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy)కి తెలంగాణ హైకోర్టు (High Court)లో భారీ ఊరట లభించింది. 2021లో జరిగిన హుజూరాబాద్ నియోజకవర్గ ఉపఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ తరపున నాడు ఎంపీ, పీసీసీ చీఫ్‌గా ఉన్న రేవంత్ రెడ్డి కమలాపూర్ (Kamalapur)లో విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. ఆ సమయంలో కోవిడ్-19 (Covid-19) నిబంధనలను ఉల్లంఘించి, అనుమతించిన దానికంటే ఎక్కువ మందితో సభ నిర్వహించారనే ఆరోపణలతో స్థానిక కమలాపూర్ పోలీసులు ఆయనపై ఐపీసీ సెక్షన్ 188 కింద కేసు నమోదు చేశారు.
అయితే, ఈ వ్యవహారంపై హైకోర్టులో సుదీర్ఘంగా విచారణ జరిగింది. రేవంత్ రెడ్డి తరపు న్యాయవాది కోర్టులో తమ వాదనలు వినిపిస్తూ.. ప్రచార సమయంలో తన క్లయింట్ అన్ని రకాల జాగ్రత్తలు పాటించారని, రాజకీయంగా ఇబ్బందులకు గురిచేయాలనే దురుద్దేశంతోనే నాటి ప్రభుత్వం ఈ కేసులను నమోదు చేయించిందని కోర్టుకు వివరించారు. వాదనలు పరిగణనలోకి తీసుకున్న న్యాయస్థానం, సీఎం రేవంత్ రెడ్డి ఎలాంటి తప్పు చేయలేదని స్పష్టం చేస్తూ ఆయనపై ఉన్న కేసును పూర్తిగా కొట్టేస్తూ ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది.






