ఉరి వేసుకొని విద్యార్థిని ఆత్మ హత్య

by velandi.Saikiran |

నాగర్ కర్నూల్ జిల్లాలో ఓ విద్యార్థిని ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్న సంఘటన బుధవారం చోటు చేసుకుంది.

ఉరి వేసుకొని విద్యార్థిని ఆత్మ హత్య
X

దిశ, పెద్ద కొత్తపల్లి: నాగర్ కర్నూల్ జిల్లాలో ఓ విద్యార్థిని ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్న సంఘటన బుధవారం చోటు చేసుకుంది. పెద్ద కొత్తపల్లి మండలం సాతాపూర్ గ్రామంలో గడ్డి కోపుల భాగ్యమ్మ, రాముడు దంపతుల కుమార్తె గడ్డి కోపుల నందిని (16) జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో చదువుతోంది. అయితే, ప్రభుత్వ హాస్టల్ లో ఉండాలని కుటుంబ సభ్యులు బలవంతం పెట్టినందుకు కలత చెందింది. ఈ క్ర‌మంలో ఇంట్లో ఎవ్వరూ లేని సమయంలో ఫ్యాన్‌ కు ఉరి వేసుకొని మృతి చెందినట్లు గ్రామస్థులు తెలిపారు.

Next Story