ఫ్లాట్ ఫామ్ 65 హోటల్లో ఫుడ్ సేఫ్టీ అధికారుల ఆకస్మిక తనిఖీలు

by velandi.Saikiran |   (  Updated:2026-06-24 14:24:24  IST  )

పీఎన్​ఆర్​ కాంప్లెక్స్​లోని ప్లాట్​ ఫాం 65 ట్రైన్​ రెస్టారెంట్​లో ఫుడ్​ సేఫ్టీ అధికారులు బుధవారం ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు.

ఫ్లాట్ ఫామ్ 65 హోటల్లో ఫుడ్ సేఫ్టీ అధికారుల ఆకస్మిక తనిఖీలు
X

దిశ, కూకట్​పల్లి: కూకట్​పల్లి భాగ్యనగర్​ కాలనీ పీఎన్​ఆర్​ కాంప్లెక్స్​లోని ప్లాట్​ ఫాం 65 ట్రైన్​ రెస్టారెంట్​లో ఫుడ్​ సేఫ్టీ అధికారులు బుధవారం ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. రెస్టారెంట్​లోని కిచెన్​లో అధికారులు ఎలుకలు సంచరించడం, ఆహార నిలువలు పేరుకు పోయి అపరిశుభ్ర వాతావరణాన్ని గుర్తించారు. అదే విధంగా పాచిపోయిన ఆహార నిల్వ‌ల‌ను గుర్తించారు. రిఫ్రీరిజిరేటర్స్​లో చాలా కాలంగా ఉన్న మాంసపు పదార్థాలు నిలువలు ఉండటాన్ని అధికారులు గుర్తించారు. వెజ్​, నాన్​వెట్​ ఆహార పదార్థాలను వేరు వేరుగా ఉంచకుండా ఒకే చోట నిలువ ఉంచినట్టు అధికారులు గుర్తించారు. ఎఫ్​ఎస్​ఎస్​ఏఐ లైసెన్స్​ రద్దు చేసేందుకు నివేదికను అందజేస్తున్నామని, రెస్టారెంట్​ యాజమాన్యానికి షోకాజ్​ నోటీసులు అందజేస్తున్నట్టు తెలిపారు. పరిశుభ్రత రేటింగ్​లో కేవలం 37 శాతం మాత్రమే పాటిస్తున్నారని, నిబంధనల ప్రకారం 50 శాతం కంటే తక్కువ ఉంటే చర్యలు తీసుకోవడం జరుగుతుందని అన్నారు. ప్రజల ఆరోగ్యంతో ఆటలాడితే కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు యాజమాన్యాన్ని హెచ్చరించారు.

Next Story