గురుకులాల్లో అధ్యాపకుల పోస్టులు.. దరఖాస్తుల ఆహ్వానం

by Vemula.Srinu Prasad |

తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ ఆధ్వర్యంలో నడుస్తున్న వివిధ ప్రత్యేక విభాగాల్లో బోధన విధులకు అర్హులైన, నిపుణులైన అధ్యాపకుల నుంచి దరఖాస్తులు కోరుతున్నారు....

గురుకులాల్లో అధ్యాపకుల పోస్టులు.. దరఖాస్తుల ఆహ్వానం
X

దిశ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ ఆధ్వర్యంలో నడుస్తున్న వివిధ ప్రత్యేక విభాగాల్లో బోధన విధులకు అర్హులైన, నిపుణులైన అధ్యాపకుల నుంచి దరఖాస్తులు కోరుతున్నారు. సంస్థ పరిధిలోని ఫౌండేషన్, స్పోర్ట్స్, డిస్ట్రిక్ట్ సెంటర్స్ ఆఫ్ ఎక్సలెన్స్‌లలో ఐఐటీ, జేఈఈ, నీట్, సీఎంఏ, సీఎల్‌టీఏ, యూపీఎస్సీ వంటి ప్రతిష్టాత్మక కోర్సులకు శిక్షణ ఇచ్చేందుకు తాత్కాలిక (గౌరవ వేతనం) ప్రాతిపదికన ఈ నియామకాలు చేపట్టనున్నారు.

దరఖాస్తు విధానం..

తగిన అర్హత, అనుభవం ఉన్న అభ్యర్థులు సొసైటీ అధికారిక వెబ్‌సైట్ ద్వారా కళాశాలల వివరాలను పరిశీలించి, అప్లికేషన్ ఫారమ్‌ను డౌన్‌లోడ్ చేసుకోవాలి. పూర్తిగా నింపిన దరఖాస్తులను జూన్ 25 నుంచి జూన్ 30, 2026 లోగా "స్టేట్ ఆఫీస్, సరూర్‌నగర్, హైదరాబాద్" చిరునామాలో స్వయంగా అందజేయాల్సి ఉంటుంది. అభ్యర్థుల సౌకర్యార్థం సెలవు రోజుల్లో కూడా దరఖాస్తులు స్వీకరిస్తామని అధికారులు తెలిపారు.

గౌరవ వేతన వివరాలు..

డిస్ట్రిక్ట్ సీవోఈలు: గంటకు రూ. 250/- చొప్పున (నెలకు గరిష్టంగా రూ. 32,500/- మించకుండా ఉంటుంది).

ఫౌండేషన్ అండ్ స్పోర్ట్స్ సీవోఈలు: గంటకు రూ. 650/- చొప్పున (రోజుకు గరిష్టంగా 7.5 గంటల వరకు ఉంటుంది).

ఈ నియామకాలు కేవలం తాత్కాలిక ప్రాతిపదికన మాత్రమే ఉంటాయి. అవసరాన్ని బట్టి ఖాళీల సంఖ్య మారవచ్చు. ముందస్తు సమాచారం లేకుండా ఎప్పుడైనా వీరి సేవలను నిలిపివేసే అధికారం సొసైటీకి ఉంటుంది. పూర్తి వివరాల కోసం అధికారిక వెబ్‌సైట్ https://tgswreis.telangana.gov.in/ ను సందర్శించవచ్చు. హెల్ప్‌లైన్ నంబర్ 040-23005100 లో సంప్రదించవచ్చని అధికారులు ఒక ప్రకటనలో పేర్కొన్నారు.

ఖాళీల వివరాలు..

మ్యాథ్స్-21

ఫిజిక్స్- 18

కెమిస్ట్రీ- 15

బోటనీ- 22

జువాలజీ- 26

సీఎంఏ- 05

సీఎల్ఏటీ- 04

యూపీఎస్సీ- 06

మొత్తం- 117

Next Story