అమ్మాయి అందంగా ఉంటే భర్త త్వరగా చనిపోతాడు.. వేణు స్వామి షాకింగ్ కామెంట్స్

by Ajay Maddhiboyina |

వివాదాస్ప‌ద జ్యోతిష్యుడు వేణుస్వామి మ‌రోసారి హాట్ కామెంట్స్ చేసి వార్తల్లో నిలిచాడు. అందమైన అమ్మాయి భ‌ర్త త్వ‌రగా చ‌నిపోతాడు లేదా విడిపోతారు అంటూ చెప్పుకొచ్చాడు. ఓ టీవీ ఇంట‌ర్వ్యూలో మాట్లాడుతూ వేణు స్వామి ఈ కామెంట్లు చేశాడు. అంద‌మైన అమ్మాయిల‌కు కుటుంబ సౌఖ్యం ఉండ‌దు అనేది ఇంధ్రుడు ఇచ్చిన శాపం అని అన్నాడు.

అమ్మాయి అందంగా ఉంటే భర్త త్వరగా చనిపోతాడు.. వేణు స్వామి షాకింగ్ కామెంట్స్
X

దిశ‌, వెబ్ డెస్స్క్: వివాదాస్ప‌ద జ్యోతిష్యుడు వేణుస్వామి మ‌రోసారి హాట్ కామెంట్స్ చేసి వార్తల్లో నిలిచాడు. అందమైన అమ్మాయి భ‌ర్త త్వ‌రగా చ‌నిపోతాడు లేదా విడిపోతారు అంటూ చెప్పుకొచ్చాడు. ఓ టీవీ ఇంట‌ర్వ్యూలో మాట్లాడుతూ వేణు స్వామి ఈ కామెంట్లు చేశాడు. అంద‌మైన అమ్మాయిల‌కు కుటుంబ సౌఖ్యం ఉండ‌దు అనేది ఇంధ్రుడు ఇచ్చిన శాపం అని అన్నాడు. అంతేకాకుండా అందెగ‌త్తెలను చూస్తే ఏజ్ గ్యాప్ ఉన్న‌వాళ్ల‌ను పెళ్లి చేసుకోవ‌డ‌మో లేదంటే సెకండ్ వైఫ్ గా వెళ్ల‌డ‌మో జ‌రిగింద‌ని వ్యాఖ్యానించాడు. కావాలంటే సినిమా ఇండ‌స్ట్రీలోని చాలా మంది హీరోయిన్ల‌నే ఉదాహ‌ర‌ణ‌గా తీసుకోవ‌చ్చ‌ని చెప్పాడు. చాలా మంది హీరోయిన్లు ఏజ్ గ్యాప్ ఉన్న‌వాళ్ల‌ను లేదా సెకండ్ వైఫ్ గా వెళ్లిన‌వాళ్లే ఉన్నార‌ని అన్నాడు.

క‌లియుగంలో అమ్మాయిలు మోసం చేసేవాళ్ల‌నే ఇష్ట‌ప‌డుతున్నార‌ని చెప్పాడు. ఎన్ని తుల‌సిమొక్క‌లు ఉన్నా వాళ్లు వెళ్లి గంజాయి మొక్క‌నే ప‌ట్టుకుంటార‌ని వ్యాఖ్యానించాడు. కొంత‌మంది జాత‌కాలు క‌ల‌వ‌క‌పోయినా పేర్లు మార్చి పెళ్లి చేసుకుంటున్నార‌ని అది చాలా త‌ప్పు అని అన్నాడు. చాలా దోషాలు అంటాయ‌ని అవ‌న్ని లేకుంటేనే పెళ్లి చేసుకోవాల‌న్నాడు. ఇక గతంలోనూ వేణుస్వామి చాలా సార్లు ఇలాంటి కామెంట్లే చేశాడు. అయితే సినిమా ఇండస్ట్రీలో ఓ రెండు మూడు జంటలు విడిపోయితాయి అని వేణుస్వామి చెప్పిన మాటలు నిజం అవ్వడంతో ఆయన జాతకాలను కొందరు నమ్ముతుంటారు. కొందరు సెలబ్రిటీలు రాజకీయనాయకులు ఆయనతో ప్రత్యేకంగా పూజలు చేయించుకుంటారు.

Next Story