- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
పెట్రోల్ బంక్ దగ్గరలో ఎగిసిపడ్డ మంటలు
by velandi.Saikiran |
నర్సంపేట మండలం లక్నేపల్లి గ్రామ శివారు పెట్రోల్ బంక్ దగ్గరలో గల తాటి వనంలో మంటలు చెలరేగాయి.

X
దిశ, నర్సంపేట: నర్సంపేట మండలం లక్నేపల్లి గ్రామ శివారు పెట్రోల్ బంక్ దగ్గరలో గల తాటి వనంలో మంటలు చెలరేగాయి. గాలి ఉధృతంగా వీస్తుండటంతో అగ్ని కీలలు పక్కన ఉన్న చెట్లకు అంటుకోవడంతో ఎగిసిపడుతున్నాయి. స్థానికుల సమాచారంతో ఎస్సై అరుణ్ కుమార్ సంఘటనా స్థలికి చేరుకున్నారు. పక్కనే పెట్రోల్ బంక్ ఉండటంతో జాగ్రతలు తీసుకుంటున్నారు. ఫైర్ ఇంజన్ సిబ్బంది చేరుకుని మంటలు ఆర్పే ప్రయత్నం చేశారు. కొంత మేరకు ప్రమాదం తప్పినట్లు తెలుస్తోంది. ఈ సంఘటనలో దాదాపు 30 -40 తాటి చెట్లు కాలిపోయినట్లు స్థానికులు చెబుతున్నారు. ఈ సంఘటనపై ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.
- Tags
- fire
- petrol bunk
Next Story






