- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
గుర్తుతెలియని వాహనం ఢీకొని వ్యక్తి దుర్మరణం
సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణ పరిధిలోని దుర్గాపురం వద్ద 65వ జాతీయ రహదారిపై బుధవారం విషాదకర ఘటన చోటుచేసుకుంది.

దిశ, కోదాడ : సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణ పరిధిలోని దుర్గాపురం వద్ద 65వ జాతీయ రహదారిపై బుధవారం విషాదకర ఘటన చోటుచేసుకుంది. గుర్తుతెలియని వాహనం ఢీకొనడంతో ఓ గుర్తుతెలియని వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. విజయవాడ నుంచి హైదరాబాద్ వైపు వెళ్తున్న ఓ గుర్తుతెలియని వాహనం రహదారిపై ఉన్న వ్యక్తిని ఢీకొట్టింది. ప్రమాద తీవ్రతకు ఆ వ్యక్తి తీవ్ర గాయాలపాలై ఘటనాస్థలంలోనే ప్రాణాలు కోల్పోయాడు. ప్రమాదానికి కారణమైన వాహనం అక్కడి నుంచి పరారైనట్లు సమాచారం సమాచారం అందుకున్న కోదాడ పట్టణ పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. అనంతరం మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కోదాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మృతుడి వివరాలు ఇంకా తెలియరాలేదని పోలీసులు తెలిపారు. మృతుడు నీలం రంగు చొక్కా, ఖాకీ రంగు ప్యాంటు ధరించి ఉన్నట్లు గుర్తించారు. అతని వయస్సు, చిరునామా తదితర వివరాలు తెలియాల్సి ఉంది. మృతుడిని ఎవరైనా గుర్తిస్తే లేదా అతనికి సంబంధించిన సమాచారం తెలిసి ఉంటే వెంటనే కోదాడ పట్టణ పోలీస్ స్టేషన్‌ను సంప్రదించాలని పోలీసులు కోరారు.






