డీసీఎం ఢీకొని వ్యక్తి మృతి

by Ratna Kumari |

డీసీఎం వాహనం ఢీకొనడంతో యాక్టివాపై వెళ్తున్న ఓ వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందిన ఘటన శంషాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది.

డీసీఎం ఢీకొని వ్యక్తి మృతి
X

దిశ, శంషాబాద్ : డీసీఎం వాహనం ఢీకొనడంతో యాక్టివాపై వెళ్తున్న ఓ వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందిన ఘటన శంషాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. ప్రమాదం అనంతరం వాహనంతో పరారైన డీసీఎంను దుండిగల్ పోలీసులు పట్టుకోగా, డ్రైవర్ మాత్రం తప్పించుకున్నాడు పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మైలార్దేవ్‌పల్లికి చెందిన జుల్ఫకర్ అలీ (55) తన స్వగ్రామమైన కుల్కచర్ల మండలం చౌడాపూర్ నుంచి యాక్టివా ద్విచక్ర వాహనంపై మైలార్దేవ్‌పల్లికి బయలుదేరాడు. ఈ క్రమంలో శంషాబాద్ పరిధిలోని తొండుపల్లి బ్రిడ్జిపై వెనుక నుంచి వేగంగా వచ్చిన డీసీఎం వాహనం యాక్టివాను బలంగా ఢీకొట్టింది.

ప్రమాద తీవ్రతకు జుల్ఫకర్ అలీ అక్కడికక్కడే మృతి చెందాడు. ప్రమాదం అనంతరం డీసీఎం డ్రైవర్ వాహనంతో అక్కడి నుంచి పరారయ్యాడు. సమాచారం అందుకున్న దుండిగల్ పోలీస్ స్టేషన్‌కు చెందిన పెట్రోల్-2 సిబ్బంది వెంటాడి డీసీఎం వాహనాన్ని పట్టుకున్నారు. అయితే డ్రైవర్ వాహనాన్ని వదిలేసి అక్కడి నుంచి పరారైనట్లు పోలీసులు తెలిపారు. దుండిగల్ పోలీసులు ఘటనపై శంషాబాద్ పోలీసులకు సమాచారం అందించగా, వారు కేసు నమోదు చేసి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. పరారీలో ఉన్న డీసీఎం డ్రైవర్ కోసం గాలింపు చర్యలు చేపట్టినట్లు, ప్రమాదానికి గల పూర్తి కారణాలపై దర్యాప్తు కొనసాగుతున్నట్లు పోలీసులు తెలిపారు.

Next Story