ట్రాక్టర్ డ్రైవర్ నిర్లక్ష్యంతో యువకుడి మృతి

by Ratna Kumari |

బీర్కూర్ మండల కేంద్రంలోని పోచారం కాలనీలో ట్రాక్టర్ డ్రైవర్ నిర్లక్ష్యం కారణంగా ఓ యువకుడు మృతి చెందిన ఘటన విషాదాన్ని నింపింది.

ట్రాక్టర్ డ్రైవర్ నిర్లక్ష్యంతో యువకుడి మృతి
X

దిశ, బాన్సువాడ : బీర్కూర్ మండల కేంద్రంలోని పోచారం కాలనీలో ట్రాక్టర్ డ్రైవర్ నిర్లక్ష్యం కారణంగా ఓ యువకుడు మృతి చెందిన ఘటన విషాదాన్ని నింపింది. స్థానిక పోచారం కాలనీకి చెందిన షేక్ సల్లు అలియాస్ సల్మాన్ ఓ ఇంటి వద్ద వాటర్ ట్యాంక్ గల్లీలో నిలబడి ఉండగా, అటువైపు వచ్చిన ట్రాక్టర్ డ్రైవర్ వెనుకకు చూసుకోకుండా అజాగ్రత్తగా రివర్స్ తీసినట్లు సమాచారం. ఈ క్రమంలో ట్రాలీ టైరు ఓ గుంతలో దిగడంతో ట్రాలీ వెనుక భాగం ఒక వైపునకు ఒరిగి, అక్కడ నిలబడి ఉన్న సల్మాన్‌పై పడింది. ట్రాక్టర్, గోడ మధ్య ఇరుక్కుపోయిన సల్మాన్ అక్కడికక్కడే మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. మృతుడి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు బీర్కూర్ ఎస్‌ఐ రాములు తెలిపారు.

Next Story