- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మహా న్యూస్ ఎండీ వంశీకృష్ణపై జూబ్లీహిల్స్‌లో కేసు నమోదు
మాజీ ఐపీఎస్ రాజకీయ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ వ్యక్తిత్వ హననానికి పాల్పడటంతో పాటు, సమాజంలో వివిధ వర్గాల మధ్య చిచ్చు పెట్టేలా కథనాలను ప్రసారం చేశారన్న ఆరోపణలపై ప్రముఖ తెలుగు వార్తా ఛానెల్ మహా న్యూస్ మేనేజింగ్ డైరెక్టర్ వంశీకృష్ణ పై కేసు నమోదైంది.

దిశ,తెలంగాణ బ్యూరో: మాజీ ఐపీఎస్ రాజకీయ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ వ్యక్తిత్వ హననానికి పాల్పడటంతో పాటు, సమాజంలో వివిధ వర్గాల మధ్య చిచ్చు పెట్టేలా కథనాలను ప్రసారం చేశారన్న ఆరోపణలపై ప్రముఖ తెలుగు వార్తా ఛానెల్ మహా న్యూస్ మేనేజింగ్ డైరెక్టర్ వంశీకృష్ణ పై కేసు నమోదైంది. ఈ మేరకు హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్ పోలీసులు వంశీకృష్ణపై ఎఫ్ఐఆర్ నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
పరువు తీసేలా హెడ్డింగ్స్.. విద్వేషాలు రెచ్చగొట్టే ప్రయత్నం...
వివరాల్లోకి వెళితే.. మహా న్యూస్ ఛానెల్‌లో గత కొన్ని రోజులుగా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్‌ను ఉద్దేశించి ప్రసారమైన కథనాలు ఎటువంటి ఆధారాలు లేకుండా, కేవలం ఆయన ప్రతిష్టను దిగజార్చే లక్ష్యంతో అడ్డగోలు హెడ్డింగ్స్‌ను వాడుతూ కథనాలను ప్రసారం చేశారని సీహెచ్ ఉదయ్ కుమార్ అనే వ్యక్తి ఈ వ్యవహారంపై జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. మహా న్యూస్ ఛానెల్ ప్రసారం చేసిన కథనాలు కేవలం ఒక వ్యక్తిని విమర్శించడానికే పరిమితం కాలేదని, అవి సమాజంలో వివిధ సామాజిక వర్గాల మధ్య విద్వేషాలను రెచ్చగొట్టేలా ఉన్నాయని ఆయన తన ఫిర్యాదులో పేర్కొన్నారు. ప్రశాంతంగా ఉన్న వాతావరణాన్ని పాడు చేసేలా, వర్గాల మధ్య గొడవలను ప్రేరేపించేలా ఈ కథనాలు ఉన్నాయని, బాధ్యతాయుతమైన పదవిలో ఉన్న వంశీకృష్ణ ఇలాంటి చర్యలకు పాల్పడటం సరికాదని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ కథనాలు ఒక వ్యక్తి గౌరవానికి భంగం కలిగించడమే కాకుండా, పత్రికా విలువలకు విరుద్ధంగా ఉన్నాయని ఫిర్యాదుదారుడు ఆరోపించారు. ఉదయ్ కుమార్ ఇచ్చిన ఫిర్యాదును పరిశీలించిన జూబ్లీహిల్స్ పోలీసులు, ప్రాథమిక ఆధారాల మేరకు వంశీకృష్ణపై కేసు నమోదు చేశారు. కొత్తగా అమలులోకి వచ్చిన భారతీయ న్యాయ సంహిత లోని సెక్షన్ 352 శాంతి భద్రతలకు విఘాతం కలిగించేలా ఉద్దేశపూర్వకంగా అవమానించడం కింద కేసును నమోదు చేశారు.






