- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మున్నా భాయ్ ఈజ్ బ్యాక్.. ‘మిర్జాపూర్: ది మూవీ’ రిలీజ్ డేట్ ఫిక్స్
‘సింహాసనం ఉంటేనే మనం ఉంటాం’’ అనే క్యాప్షన్‌ను జత చేసి అంచనాలను పెంచారు. ఇక ఈ మూవీ టీజర్ జూన్ 25న రిలీజ్ కాబోతున్నట్లు కూడా వెల్లడించారు.

దిశ, సినిమా: ఓటీటీలో సంచలనం సృష్టించిన మిర్జాపూర్ సిరీస్‌ను మేకర్స్ వెండితెరపై చూపించేందుకు రెడీ అయ్యారు. ‘మిర్జాపూర్: ది మూవీ’ టైటిల్‌తో రాబోతుండగా.. గుర్మీత్ సింగ్ దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో దివ్యేందు శర్మ, పంకజ్ త్రిపాఠి, సోనల్ చౌహాన్, అలీ ఫజల్ ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. అయితే ఈ చిత్రాన్ని అమెజాన్ ఎంజీఎం స్టూడియోస్‌తో కలిసి ఎక్సైల్ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై రితేష్ సిద్ధ్వానీ, ఫర్హాన్ అక్తర్ అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. అయితే మిర్జాపూర్ సామ్రాజ్యాన్ని శాసించిన ఐకానిక్ పాత్రలైన కాలీన్ భయ్యా, మున్నా భయ్యా, గుడ్డు భయ్యా లుక్స్ సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి. ఈనేపథ్యంలో.. చిత్రబృందం ఈ మూవీ విడుదల తేదీని ప్రకటించారు. 2026 ప్రపంచవ్యాప్తంగా సెప్టెంబర్ 4న తెలుగుతో పాటు హిందీ భాషలోనూ విడుదల కాబోతున్నట్లు వెల్లడించారు. అంతేకాకుండా ‘‘సింహాసనం ఉంటేనే మనం ఉంటాం’’ అనే క్యాప్షన్‌ను జత చేసి అంచనాలను పెంచారు. ఇక ఈ మూవీ టీజర్ జూన్ 25న రిలీజ్ కాబోతున్నట్లు కూడా వెల్లడించారు.






