- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మాధవరంకు సీఎం.. భద్రతా ఏర్పాట్లను పరిశీలించిన ఎస్పీ
ఈ నెల 25వ తేదీన మంత్రాలయం మండలం మాధవరం గ్రామానికి రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు విచ్చేయనున్న నేపథ్యంలో పర్యటనకు సంబంధించిన భద్రతా ఏర్పాట్లను నంద్యాల జిల్లా ఎస్పీ సునీల్ షొరాణ్ ఐపీఎస్ పరిశీలించారు...

దిశ, మంత్రాలయం: ఈ నెల 25వ తేదీన మంత్రాలయం మండలం మాధవరం గ్రామానికి రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు విచ్చేయనున్న నేపథ్యంలో పర్యటనకు సంబంధించిన భద్రతా ఏర్పాట్లను నంద్యాల జిల్లా ఎస్పీ సునీల్ షొరాణ్ ఐపీఎస్ పరిశీలించారు. ముఖ్యమంత్రి పర్యటన సందర్భంగా సభా ప్రాంగణం, హెలిప్యాడ్, వాహన పార్కింగ్ ప్రాంతాలు మరియు ఇతర కీలక ప్రాంతాల్లో చేపట్టిన భద్రతా ఏర్పాట్లను సమీక్షించారు. ముఖ్యమంత్రి పర్యటన భద్రతా ఏర్పాట్లలో భాగంగా సుమారు 500 మంది పోలీసు అధికారులు, సిబ్బందిని విధుల్లో నియమించినట్లు తెలిపారు. అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేసి పర్యటనను విజయవంతం చేయాలని, విధుల్లో ఉన్న పోలీసు అధికారులు, సిబ్బంది అప్రమత్తంగా వ్యవహరించి ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు తావులేకుండా విధులు నిర్వర్తించాలని ఎస్పీ సూచించారు. బందోబస్తు నిమిత్తం వచ్చిన పోలీసు అధికారులకు, సిబ్బందికి మంత్రాలయంలోని రివేరా ఫంక్షన్ హాల్లో భద్రతా విధులపై దిశానిర్దేశం చేశారు.
ఈ కార్యక్రమంలో నంద్యాల స్పెషల్ బ్రాంచ్ డీఎస్పీ శ్రీనివాసరెడ్డి, కర్నూలు మహిళా పోలీస్ స్టేషన్ డీఎస్పీ ఉపేంద్ర బాబు,సీఐలు, ఎస్ఐలు మరియు ఇతర పోలీసు అధికారులు పాల్గొన్నారు.






