- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
భారత పౌరులకు బిగ్ అలర్ట్.. పాస్‌పోర్ట్ పౌరసత్వాన్ని డిసైడ్ చేయదు
పాస్‌పోర్టులపై భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ సంచలన ప్రకటన చేసింది.

దిశ, వెబ్‌డెస్క్: భారత పౌరులకు కేంద్ర ప్రభుత్వం అత్యంత కీలకమైన ప్రకటన చేసింది. సాధారణంగా భారతీయులకు మాత్రమే జారీ చేసే పాస్‌పోర్ట్ (Passport), దేశ పౌరసత్వాన్ని (Citizenship) నిరూపించే తుది పత్రం కాదని విదేశాంగ మంత్రిత్వ శాఖ (MEA) స్పష్టం చేసింది. పాస్‌పోర్ట్ సేవా దివస్ (Passport Seva Divas) సందర్భంగా కేంద్ర ప్రభుత్వం చేసిన ఈ ప్రకటన ప్రస్తుతం దేశవ్యాప్తంగా హాట్‌టాపిక్‌గా మారింది.
పాస్‌పోర్ట్ కేవలం ప్రయాణానికి మాత్రమే..
విదేశాంగ శాఖ తెలిపిన వివరాల ప్రకారం.. పాస్‌పోర్ట్ అనేది ప్రాథమికంగా కేవలం ఓ అంతర్జాతీయ ప్రయాణ పత్రమేనని.. విదేశీ ప్రయాణాలను సులభతరం చేసేందుకు మాత్రమే ప్రభుత్వం దీనిని జారీ చేస్తుందని తెలిపారు. ఓ వ్యక్తి విదేశాల్లో ఉన్నప్పుడు ఆయన భారతీయ జాతీయుడని (Nationality) ధృవీకరించడానికి ఇది ఉపయోగపడుతుంది తప్ప, అది దేశ పౌరసత్వానికి అంతిమ ఆధారం కాబోదని కేంద్రం పేర్కొంది.
ఆధార్, ఓటర్ ఐడీ కూడా..
ఇప్పటికే సుప్రీంకోర్టు కీలక విచారణల సందర్భంగా ఆధార్ కార్డ్ (Aadhaar Card) అనేది కేవలం ఒక వ్యక్తి గుర్తింపు పత్రం (Identity) మాత్రమే కానీ, పౌరసత్వ నిరూపణ పత్రం కాదని స్పష్టం చేసింది. అలాగే ఓటర్ ఐడీ కార్డ్ (Voter ID) కూడా కేవలం ఓటు వేయడానికి, నివాస ధృవీకరణకు మాత్రమే ఉపయోగపడుతుంది కానీ పౌరసత్వానికి కాదని పేర్కొంది. చట్టాల ప్రకారం.. జనన ధృవీకరణ పత్రాలు (Birth Certificates) నిర్దేశిత సంవత్సరాల కంటే ముందు తల్లిదండ్రులు ఇక్కడే నివసించినట్లుగా ఉండే కేంద్ర ప్రభుత్వ అధికారిక పత్రాలే పౌరసత్వాన్ని డిసైడ్ చేస్తాయని విదేశాంగ పేర్కొంది.






