ప్రమాదవశాత్తు కుంటలో పడి వ్యక్తి మృతి..

by Taduka Kalyani |

కాలకృత్యాల కోసం వెళ్లి ప్రమాదవశాత్తు కాలుజారి కుంటలో పడి వ్యక్తి మృతి చెందిన ఘటన దుబ్బాక మున్సిపాలిటీ పరిధిలోని దుంపల పల్లి లో బుధవారం చోటుచేసుకుంది.

ప్రమాదవశాత్తు కుంటలో పడి వ్యక్తి మృతి..
X

దిశ, దుబ్బాక: కాలకృత్యాల కోసం వెళ్లి ప్రమాదవశాత్తు కాలుజారి కుంటలో పడి వ్యక్తి మృతి చెందిన ఘటన దుబ్బాక మున్సిపాలిటీ పరిధిలోని దుంపల పల్లి లో బుధవారం చోటుచేసుకుంది. దుబ్బాక ఎస్సై కీర్తి రాజు తెలిపిన వివరాల ప్రకారం.. దుంపల పల్లి వార్డుకు చెందిన ఎద్దు రాజు (40) కూలీ పనులు చేస్తూ, వృద్ధులైన తల్లిదండ్రులు, సోదరుడితో కలిసి నివాసం ఉంటున్నాడు. ప్రతి రోజు మాదిరిగానే బుధవారం రోజు ఉదయం ఇంట్లోనే చెప్పులు, సెల్ ఫోన్ పెట్టి, కాలకృత్యాలు తీర్చుకోవడం కోసం సమీపంలోని దాలకుంటకు వెళ్లాడు. అక్కడ ప్రమాదవశాత్తు కాలుజారి, కుంటలో పడి మృతి చెందాడు. ఇంట్లో నుంచి బయటకు వెళ్లిన వ్యక్తి సాయంత్రమైనా తిరిగి రాకపోయేసరికి, కుటుంబ సభ్యులు పలుచోట్ల గాలించారు. గురువారం ఉదయం దామరకుంట నీటిలో రాజు మృతదేహాన్ని స్థానికులు గుర్తించారు. దీంతో సమాచారం అందుకున్న కుటుంబ సభ్యులు అక్కడికి చేరుకుని, మృతదేహాన్ని చూసి బోరుమన్నారు. అనంతరం పోలీసులు మృతదేహాన్ని శవ పరీక్ష నిమిత్తం దుబ్బాక వంద పడకల ఆసుపత్రికి తరలించారు. మృతుని తల్లి వజ్రవ్వ ఇచ్చిన ఫిర్యాదు మేరకు దుబ్బాక పోలీసులు కేసు నమోదు చేశారు.

Next Story