మాజీ సర్పంచ్ సంపత్ ఆత్మహత్య.. అభివృద్ధి పనులపై విచారణ నివేదిక

by Taduka Kalyani |

బిల్లులు రాక మనస్తాపంతో మహమ్మదాపూర్ గ్రామ మాజీ సర్పంచ్ పిట్టల సంపత్ ఆత్మహత్య చేసుకున్న ఘటనపై కలెక్టర్ ఆదేశాల మేరకు విచారణ పూర్తయింది.

మాజీ సర్పంచ్ సంపత్ ఆత్మహత్య.. అభివృద్ధి పనులపై విచారణ నివేదిక
X

దిశ, హుస్నాబాద్‌: బిల్లులు రాక మనస్తాపంతో మహమ్మదాపూర్ గ్రామ మాజీ సర్పంచ్ పిట్టల సంపత్ ఆత్మహత్య చేసుకున్న ఘటనపై కలెక్టర్ ఆదేశాల మేరకు విచారణ పూర్తయింది. ఆయన పదవీకాలంలో చేపట్టిన అభివృద్ధి పనుల బిల్లుల చెల్లింపులపై జిల్లా స్థానిక పంచాయతీ అధికారి (డీఎల్పీఓ) వెంకటేశ్వర్లు నివేదిక వివరాలను వెల్లడించారు. మహమ్మదాపూర్‌లో మొత్తం ఆరు పనులు జరగ్గా.. పంచాయతీ అభివృద్ధి ప్రణాళిక, ఫైనాన్స్ కమిషన్ నిధుల కింద అనుమతి పొందిన మూడు పనుల అంచనా వ్యయం రూ.2,56,475 అని తెలిపారు. వీటికిగానూ ఇప్పటివరకు రూ.1,64,205 చెల్లించామని, మరో రూ.92,270 బకాయి ఉందని పేర్కొన్నారు. మిగిలిన మూడు పనులకు గ్రామపంచాయతీ ప్రణాళికలో అనుమతులు, తీర్మానాలు లేకపోవడం వల్లే రూ.3,37,268 బిల్లులు పెండింగ్‌లో ఉన్నట్లు స్పష్టం చేశారు. నిబంధనల ప్రకారమే ఈ చెల్లింపులు నిలిచిపోయాయని, భవిష్యత్తులో వీటిని ప్రణాళికలో చేర్చి, అనుమతులు పొందిన తర్వాతే నిధులు విడుదల చేస్తామన్నారు. ఈ మేరకు పూర్తి విచారణ నివేదికను కలెక్టర్‌కు సమర్పించినట్లు డీఎల్పీఓ తెలిపారు.

Next Story