వ్యసనాలకు దూరంగా నవజీవనం సాగించాలి

by Taduka Kalyani |

మంచి మార్పుతో కొత్త జీవితాన్ని ప్రారంభించాలని జిల్లా కలెక్టర్ రాజర్షి షా అన్నారు. నషా ముక్త్ భారత్ సప్తాహ్‌లో భాగంగా బుధవారం డవ్ పునరావాస కేంద్రాన్ని సందర్శించారు.

వ్యసనాలకు దూరంగా నవజీవనం సాగించాలి
X

దిశ,ఆదిలాబాద్ : మంచి మార్పుతో కొత్త జీవితాన్ని ప్రారంభించాలని జిల్లా కలెక్టర్ రాజర్షి షా అన్నారు. నషా ముక్త్ భారత్ సప్తాహ్‌లో భాగంగా బుధవారం డవ్ పునరావాస కేంద్రాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా అక్కడ నిర్వహిస్తున్న మెడికల్ క్యాంప్,టీబీ ముక్త్ భారత్ ఎక్స్‌రే క్యాంపును పరిశీలించారు. వ్యసనాలకు పూర్తిగా దూరంగా ఉండి కుటుంబం,పిల్లల భవిష్యత్తు కోసం బాధ్యతాయుతంగా జీవించాలని సూచించారు. అనంతరం కేంద్రం ఆవరణలో మొక్కలు నాటి పర్యావరణ పరిరక్షణపై అవగాహన కల్పించారు.ఈ కార్యక్రమంలో డీఎంహెచ్‌ఓ సాధన, జిల్లా సంక్షేమ అధికారి మిల్కా, వైద్యులు, కేంద్రం నిర్వాహకులు దేవేందర్ పాల్గొన్నారు.

Next Story