108 గ్రాముల గంజాయి స్వాధీనం

by Ratna Kumari |   (  Updated:2026-06-24 15:43:26  IST  )

చుంచుపల్లి పోలీస్ స్టేషన్ ఎస్ఐ రవికుమార్ కు వచ్చిన నమ్మ దగిన సమాచారం మేరకు, రామాంజనేయ కాలనీ గ్రామ సమీపంలోని చెరువు కట్ట ప్రాంతంకు వెళ్లగా, అక్కడ రామాంజనేయ కాలనీకి చెందిన నలుగురు వ్యక్తులు గంజాయి సేవిస్తున్నట్లు గుర్తించారు.

108 గ్రాముల గంజాయి స్వాధీనం
X

దిశ, చుంచుపల్లి : చుంచుపల్లి పోలీస్ స్టేషన్ ఎస్ఐ రవికుమార్ కు వచ్చిన నమ్మ దగిన సమాచారం మేరకు, రామాంజనేయ కాలనీ గ్రామ సమీపంలోని చెరువు కట్ట ప్రాంతంకు వెళ్లగా, అక్కడ రామాంజనేయ కాలనీకి చెందిన నలుగురు వ్యక్తులు గంజాయి సేవిస్తున్నట్లు గుర్తించారు. మబ్బు అవినాష్ అలియాస్ బిన్ను, దొమ్మేటి మధు, కొండేటి సాయి గణేష్ అలియాస్ గణేష్, ఎస్.కె కాజా పాషా అలియాస్ బబులు, భూపతి ఉదయ్ కిరణ్ అలియాస్ పరిలపల్లి ఉదయ్ కిరణ్ వద్ద గంజాయి కలిగి ఉండి, తాగుటకు సిద్ధంగా ఉండగా చుంచుపల్లి ఎస్సై రవికుమార్ తన సిబ్బంది వారిని పట్టుకున్నారు. పంచుల సమక్షంలో పంచనామా నిర్వహించి అట్టి ఐదుగురు ముద్దాయిల వద్ద నుండి 108 గ్రాముల గంజాయి, సుమారు రూ. 5800 విలువ గల న‌గ‌దు, మూడు సెల్ఫోన్లు, రెండు మోటార్ సైకిల్ లను స్వాధీన పరుచుకొని, పోలీస్ స్టేషన్కు వచ్చి తగు చర్య నిమిత్తం కేసు నమోదు చేసినట్లు తెలిపారు.

Next Story