ఇక సాగవ్.. ఏ జైలో నిర్ణయించుకో: జగన్‌కు బుచ్చయ్య చౌదరి వార్నింగ్

by Vemula.Srinu Prasad |

ఇకపై తమ ఆటలు సాగవని, ఏ జైలో నిర్ణయించుకోవాలని మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డిపై రాజమండ్రి రూరల్ టీడీపీ ఎమ్మెల్యే బుచ్చయ్య చౌదరి వార్నింగ్ ఇచ్చారు. జగన్ రాజమండ్రి సెంట్రల్ జైలులోనా, చంచల్ గూడా జైల్లోనా అన్నది అతనే నిర్ణయించుకోవాలని ఆయన సూచించారు....

ఇక సాగవ్.. ఏ జైలో నిర్ణయించుకో: జగన్‌కు బుచ్చయ్య చౌదరి వార్నింగ్
X

దిశ, వెబ్ డెస్క్: ఇకపై తమ ఆటలు సాగవని, ఏ జైలో నిర్ణయించుకోవాలని మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డి(Former Cm Jagan Mohan Reddy)పై రాజమండ్రి రూరల్ టీడీపీ ఎమ్మెల్యే బుచ్చయ్య చౌదరి(Rajahmundry Rural Tdp Mla Buchayya Chowdary) వార్నింగ్ ఇచ్చారు. జగన్ రాజమండ్రి సెంట్రల్ జైలులోనా, చంచల్ గూడా జైల్లోనా అన్నది అతనే నిర్ణయించుకోవాలని ఆయన సూచించారు. జాతి సమైక్యత కోసం కృషి చేస్తున్న పవన్ కల్యాణ్‌పై దుష్ప్రచారం చేస్తున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. గత ప్రభుత్వ విధానాలతో రాష్ట్రం త్రీవంగా నష్టపోయిందన్నారు. వెన్నుపోటు అని ప్రచారం చేస్తున్న వైఎస్ఆర్ సీపీ తమరు చేసిన విద్వేషాలు గుర్తులేవా అని ప్రశ్నించారు. అన్న క్యాంటీన్ మూసేసి పేదలు కడుపు కొట్టిన జగన్ కనీసం రాజన్న క్యాంటీన్ అని పేరు పెట్టి పేదలు కడుపులు నింపారా అని నిలదీశారు. జగన్ చేసిన అప్పులకు వడ్డీలు కట్టడానికి, ప్రభుత్వానికి తలకుమించిన భారంగా ఉందని బుచ్చయ్య చౌదరి విమర్శించారు.

వైసీపీ బూతుల పంచాంగాన్ని సహించం

‘‘అభివృద్ధి, సంక్షేమంతో దూసుకుపోతున్న కూటమి ప్రభుత్వం ముందు జగన్ ఆటలు సాగవు. వైసీపీ బూతుల పంచాంగాన్ని ప్రభుత్వం సహించదు. నా తండ్రిని పరామర్శించడానికి సమయం లేదా అని ముద్రగడ పద్మనాభం కూతురు జగన్‌ను ప్రశ్నించింది. జగన్‌కు ప్రాణబీతి ఉంది కాబట్టి బయట తిరగడం లేదు. కనీసం 500 మంది ఉంటే కానీ జగన్ బయటకు రాలేడు. కాపు రిజర్వేషన్ ఎందుకు జగన్ అమలు చేయలేదు. కాపు కార్పొరేషన్ ద్వారా విదేశీ విద్యకు నిధులు ఎందుకు ఇవ్వలేదు. బొత్స, తోట త్రిమూర్తులు ఎందుకు కాపులకు న్యాయం చేయలేదు. ముద్రగడ అయితే ఏకంగా పేరే మార్చుకున్నాడు.’’ అని బుచ్చయ్య చౌదరి గుర్తు చేశారు.

Next Story