- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
సైబర్ మోసగాళ్లకు మ్యూల్ ఖాతాలు.. ఆరుగురు అరెస్ట్..
సైబర్ చీటర్స్ కు బ్యాంక్ ఖాతాలు ఇచ్చి సైబర్ మోసాలను ప్రోత్సహిస్తున్న ఆరుగురిని హైదరాబాద్ సైబర్ క్రైం పోలీసులు అరెస్టు చేశారు.

దిశ, సిటీ క్రైమ్ : సైబర్ చీటర్స్ కు బ్యాంక్ ఖాతాలు ఇచ్చి సైబర్ మోసాలను ప్రోత్సహిస్తున్న ఆరుగురిని హైదరాబాద్ సైబర్ క్రైం పోలీసులు అరెస్టు చేశారు. పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం..హైదరాబాద్ కు చెందిన ఓ వ్యాపారిని ట్రేడింగ్ తో పాటు ఐపీఓ ల కేటాయింపులో భారీ లాభాలు ఇస్తామని ఓ కంపెనీ పేరు చెప్పి వాట్సాప్ లో పరిచయమయ్యారు. ముందుగా పెట్టుబడికి 1.05 లక్షల విత్ డ్రా చేసుకునేలా చేసి వ్యాపారి నమ్మకాన్ని గెల్చుకున్నారు. దీంతో వ్యాపారి గుర్తు తెలియని వ్యక్తులు చెప్పిన విధంగానే డబ్బులు డిపాజిట్ చేస్తూ మొత్తం 1.22 కోట్ల రూపాయాలను జమ చేశాడు. అతనికి కేటాయించిన ఐడీలో మొత్తం 15 కోట్ల రూపాయలు లాభాలు వచ్చాయని లెక్కలు చూపించారు. ఈ నగదును విత్ డ్రా చేసుకునేందుకు వ్యాపారి ప్రయత్నించగా 35 లక్షలు డిపాజిట్ చేయాలని చెప్పారు. దీంతో తాను మోసపోయానని గ్రహించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. దర్యాప్తులో సైబర్ క్రైం పోలీసులు భారీగా ఆర్థిక లావాదేవీలు జరిపే విధంగా ఓ కంపెనీ మీద కరెంట్ అకౌంట్ ను తెరిచారు. దీంతో పాటు మరికొన్ని బ్యాంకు ఖాతాలను తెరిచి వాటిని సైబర్ నేరగాళ్లకు కమీషన్ ల కోసం ఇచ్చారని గుర్తించారు. దర్యాప్తులో మ్యూల్ ఖాతాల నెట్ వర్క్ ను గుర్తించిన పోలీసులు హైదరాబాద్ కు చెందిన ఇద్దరు, ఏపీకి చెందిన ఇద్దరు, మహారాష్ట్రకు చెంది మరో ఇద్దరిని గుర్తించి మొత్తం ఆరుగురిని బుధవారం అరెస్టు చేశారు. ఈ మ్యూల్ ఖాతాలు దాదాపు దేశవ్యాప్తంగా చోటు చేసుకున్న 44 సైబర్ మోసాల్లో కీలక పాత్రను పోషించాయని పోలీసులు తేల్చారు. ఈ బ్యాంక్ ఖాతాల్లో దాదాపు 4.50 కోట్ల రూపాయాల లావాదేవీలు ఆన్ లైన్ లో జరిగాయని పోలీసులు నిర్ధారించారు.






