- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
రాష్ట్రంలో పలు జిల్లాలకు వర్ష సూచన
రాష్ట్రంలోని పలు జిల్లాల్లో గురువారం తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది..

X
దిశ, ఏపీ బ్యూరో: రాష్ట్రంలోని పలు జిల్లాల్లో గురువారం తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది. విజయనగరం, మన్యం, అల్లూరి సీతారామరాజు, పోలవరం ప్రాంతం, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్ జిల్లాల్లో అక్కడక్కడ వర్షాలు కురిసే అవకాశముందని తెలిపింది. అలాగే మిగిలిన జిల్లాల్లో కొన్ని ప్రాంతాల్లో పిడుగులు, ఉరుములతో కూడిన తేలికపాటి వర్షాలు పడే అవకాశం ఉందని పేర్కొంది. ఈ నేపథ్యంలో రైతులు, వ్యవసాయ కూలీలు, పశుకాపరులు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. ఆకాశం మేఘావృతమై ఉరుములు వినిపించిన వెంటనే పొలాల్లో పనులు నిలిపివేసి సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని, చెట్ల కింద లేదా బహిరంగ ప్రదేశాల్లో నిలబడకుండా జాగ్రత్తలు తీసుకోవాలని విపత్తుల నిర్వహణ సంస్థ సూచించింది.
Next Story






