- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Economy: జీడీపీ వృద్ధిపై ఎస్అండ్‌పీ కోత
అంతర్జాతీయ చమురు ధరల పెరుగుదల, సాధారణం కంటే తక్కువ వర్షపాతం, ప్రపంచ ఆర్థిక వృద్ధి మందగించడం వంటి అంశాలు దీనికి ప్రధాన కారణాలని అభిప్రాయపడింది.

దిశ, బిజినెస్ బ్యూరో: భారత ఆర్థిక వ్యవస్థ వృద్ధి వేగం వచ్చే ఆర్థిక సంవత్సరంలో కొంత మందగించే అవకాశం ఉందని ఎస్అండ్‌పీ గ్లోబల్ రేటింగ్స్ అంచనా వేసింది. ఆసియా-పసిఫిక్ ప్రాంతంపై విడుదల చేసిన తాజా నివేదికలో, 2025-26లో 7.7 శాతం వృద్ధిని నమోదు చేసిన దేశ జీడీపీ, 2026-27లో 6.6 శాతానికి తగ్గవచ్చని పేర్కొంది. అంతర్జాతీయ చమురు ధరల పెరుగుదల, సాధారణం కంటే తక్కువ వర్షపాతం, ప్రపంచ ఆర్థిక వృద్ధి మందగించడం వంటి అంశాలు దీనికి ప్రధాన కారణాలని అభిప్రాయపడింది. ఎల్‌నినో ప్రభావంతో రుతుపవనాలు బలహీనపడగా, జూన్ 22 నాటికి వర్షపాత లోటు 43 శాతానికి చేరడం ఆందోళన కలిగిస్తోంది. ఇంధన ధరలు పెరగడంతో పాటు అధిక ఎరువుల వ్యయం, వ్యవసాయ ఉత్పత్తిపై ఒత్తిడి కారణంగా ద్రవ్యోల్బణం మళ్లీ పెరిగే ప్రమాదం ఉందని ఎస్అండ్‌పీ హెచ్చరించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ద్రవ్యోల్బణం 5.1 శాతానికి చేరవచ్చని అంచనా వేసింది. ద్రవ్యోల్బణం పెరగడం వల్ల ప్రజల కొనుగోలు శక్తి తగ్గి, వినియోగం మందగించే ప్రమాదం ఉంది. దీంతో దేశీయ డిమాండ్‌పై ఒత్తిడి పెరిగి, ఆర్థిక వృద్ధి కూడా ప్రభావితమవుతుందని ఎస్అండ్‌పీ వివరించింది. పశ్చిమాసియా ఉద్రిక్తతలు ఇంధన మార్కెట్లపై ఇప్పటికే ప్రభావం చూపుతున్నాయని, దాని ప్రభావం భారత్ వంటి దిగుమతి ఆధారిత ఆర్థిక వ్యవస్థలపై మరింత స్పష్టంగా కనిపించే అవకాశముందని సంస్థ వెల్లడించింది.






