తోటపల్లి వద్ద రోడ్డు ప్రమాదం..

by Taduka Kalyani |

రాజీవ్ రహదారిపై Ts 07FC 6040 గల మారుతి ఆల్టో కారు అదుపుతప్పి చెట్ల పొదల్లోకి దూసుకెళ్లిన సంఘటన సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండలం తోటపల్లి గ్రామ శివారులో చోటుచేసుకుంది.

తోటపల్లి వద్ద రోడ్డు ప్రమాదం..
X

దిశ,బెజ్జంకి : రాజీవ్ రహదారిపై Ts 07FC 6040 గల మారుతి ఆల్టో కారు అదుపుతప్పి చెట్ల పొదల్లోకి దూసుకెళ్లిన సంఘటన సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండలం తోటపల్లి గ్రామ శివారులో చోటుచేసుకుంది. స్థానికుల వివరాల ప్రకారం.. హైదరాబాద్ కి చెందిన డ్రైవర్ నంగునూరు సంతోష్, పుల్లయ్య ఆయన భార్య ఒక బాబు కారులో ఉన్నారు. బుధవారం ఉదయం హైదరాబాద్ నుంచి కరీంనగర్ లో పెళ్లికి వెళ్తున్న క్రమంలో తోటపల్లి రాజీవ్ రహదారిపై కారు అదుపుతప్పి చెట్లపొదల్లోకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ముగ్గురికి స్వల్ప గాయాలయ్యాయి. స్థానికులు వెంటనే స్పందించి టోల్ ప్లాజా కు సమాచారం అందించడంతో వెంటనే ఘటనా స్థలానికి చేరుకొని టోల్ ప్లాజా సిబ్బంది అంబులెన్స్ లో కారులో చిక్కుకున్న వారిని బయటకు తీసి కరీంనగర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది..

Next Story