- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
RBI: వడ్డీ రేట్ల పెంపుపై ఇప్పుడే చర్చించడం తొందరపాటు
చమురు ధరల ఒత్తిడి తగ్గినా ప్రమాదం పూర్తిగా తొలగిపోయిందని చెప్పడానికి ఇంకా సమయం ఉందని స్పష్టం చేశారు.

దిశ, బిజినెస్ బ్యూరో: పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు తగ్గడం, ఇరాన్‌తో శాంతి ప్రయత్నాలు కొనసాగడం ప్రపంచ ఆర్థిక వ్యవస్థతో పాటు భారత్‌కు కూడా సానుకూల పరిణామాలని ఆర్‌బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా పేర్కొన్నారు. భారత్ తన చమురు అవసరాల్లో దాదాపు 90 శాతం దిగుమతులపైనే ఆధారపడుతున్నందున, పశ్చిమాసియాలో స్థిరత్వం నెలకొంటే వృద్ధి, ద్రవ్యోల్బణం రెండింటికీ మేలు జరుగుతుందని ఆయన అన్నారు. అయితే కాల్పుల విరమణ ఇంకా పూర్తవలేదని, చమురు సరఫరాలు, నిల్వలు సాధారణ స్థితికి చేరుకోవడానికి కొంత సమయం పట్టవచ్చని స్పష్టం చేశారు. అందుకే చమురు ధరల ఒత్తిడి తగ్గినా ప్రమాదం పూర్తిగా తొలగిపోయిందని చెప్పడానికి ఇంకా సమయం ఉందని స్పష్టం చేశారు. బుధవారం జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ.. వడ్డీ రేట్ల పెంపుపై ఊహాగానాలను కూడా ఆయన తోసిపుచ్చారు. చమురు ధరలు, రుతుపవనాలపై అనిశ్చితి ఉన్నందున వడ్డీ రేట్ల తగ్గింపుపై ఇప్పుడే మాట్లాడటం తొందరపాటు అవుతుంది. ఆర్‌బీఐ ప్రస్తుతానికి 'తటస్థ' వైఖరితో వేచి చూసే ధోరణిలోనే ఉంటుందన్నారు. మరోవైపు, గ్లోబల్ టెన్షన్స్ ఉన్నా దేశంలో క్యాపెక్స్ (కార్పొరేట్ పెట్టుబడులు) బలంగా ఉన్నాయి. షిప్ బిల్డింగ్, హాస్పిటాలిటీ రంగాలు దూసుకెళ్తున్నాయి. రూపాయికి మద్దతుగా తీసుకున్న చర్యలకు స్పందన బాగుందని, విదేశీ మారక మార్కెట్ సానుకూలంగా పనిచేస్తోందని ఆశాభావం వ్యక్తం చేశారు.






