ప్రపంచవ్యాప్తంగా అపార అవకాశాలు

by Taduka Kalyani |

హోటల్ మేనేజ్‌మెంట్, క్యులినరీ ఆర్ట్స్‌తో గ్లోబల్ కెరీర్‌కు అపార అవకాశాలు ఉన్నాయని ఉస్మానియా యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ కుమార్ మొలుగరం తెలిపారు.

ప్రపంచవ్యాప్తంగా అపార అవకాశాలు
X

దిశ, హిమాయత్ నగర్ : హోటల్ మేనేజ్‌మెంట్, క్యులినరీ ఆర్ట్స్‌తో గ్లోబల్ కెరీర్‌కు అపార అవకాశాలు ఉన్నాయని ఉస్మానియా యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ కుమార్ మొలుగరం తెలిపారు. హాస్పిటాలిటీ రంగంలో ఉన్న అవకాశాల పట్ల విద్యార్థులు, తల్లిదండ్రులు, అధ్యాపకులు, కెరీర్ కౌన్సిలర్లకు మరింత అవగాహన కల్పించేందుకు ఉస్మానియా యూనివర్సిటీ అనుబంధ హోటల్ మేనేజ్‌మెంట్, క్యులినరీ ఆర్ట్స్ కళాశాలలు, తెలంగాణ చెఫ్స్ అసోసియేషన్, 'తెలంగాణ ఎడ్యుకేటర్స్ అసోసియేషన్ ఆఫ్ క్యులినరీ అండ్ హాస్పిటాలిటీ' ఆధ్వర్యంలో సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, పరిశ్రమల మారుతున్న అవసరాలు, అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా విశ్వవిద్యాలయం తన హాస్పిటాలిటీ పాఠ్యప్రణాళికను నిరంతరం అప్‌గ్రేడ్ చేస్తుందని చెప్పారు. ఈ కోర్సులు ప్రాక్టికల్ లాబొరేటరీలు, ఇండస్ట్రియల్ ట్రైనింగ్, ఇంటర్న్‌షిప్‌లు, లైవ్ ప్రాజెక్ట్‌లు, పరిశ్రమల ప్రముఖులతో పరస్పర చర్చలు, కమ్యూనికేషన్ స్కిల్స్, నాయకత్వ లక్షణాల పెంపుదల, అంతర్జాతీయ అత్యుత్తమ విధానాల ద్వారా విద్యార్థులకు ప్రయోగాత్మక అభ్యాసాన్ని అందించడంపై ప్రత్యేకంగా దృష్టి పెట్టామన్నారు. ప్రపంచంలో అధికంగా ఉపాధి అవకాశాలు కల్పిస్తున్న రంగాలలో హాస్పిటాలిటీ రంగం ఒకటన్నారు. ఈ కార్యక్రమంలో రాడిసన్ బ్లూ హోటల్స్ సేల్స్ అండ్ మార్కెటింగ్ డైరెక్టర్ రాజ్ భట్టాచార్య, తెలంగాణ అసోసియేషన్ ఆఫ్ ఎడ్యుకేటర్స్ ఇన్ క్యులినరీ అండ్ హాస్పిటాలిటీ (టీచ్) ప్రెసిడెంట్ సాక సుధా కుమార్, తదితరులు పాల్గొన్నారు.

Next Story