- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఒక్కో కెమెరా వందమంది నేత్రాలతో సమానం
మండల పరిధిలోని తాటిపాముల గ్రామంలో నూతనంగా ఏర్పాటు చేసిన నిఘా కెమెరాలను సూర్యాపేట డీఎస్పీ ప్రసన్న కుమార్ ప్రారంభించారు.

దిశ, తిరుమలగిరి : మండల పరిధిలోని తాటిపాముల గ్రామంలో నూతనంగా ఏర్పాటు చేసిన నిఘా కెమెరాలను సూర్యాపేట డీఎస్పీ ప్రసన్న కుమార్ బుధవారం ప్రారంభించారు. గ్రామపంచాయతీ కార్యాలయం వద్ద నిర్వహించిన కార్యక్రమంలో గ్రామ అధికారులు, పోలీసు సిబ్బంది, గ్రామస్థులతో కలిసి ఆయన కెమెరాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా డీఎస్పీ ప్రసన్న కుమార్ మాట్లాడుతూ.. గ్రామ భద్రతను బలోపేతం చేయడంలో నిఘా కెమెరాలు కీలక పాత్ర పోషిస్తాయని తెలిపారు. ఒక్కో కెమెరా వందమంది నేత్రాలతో సమానమని, గ్రామంలో జరిగే ప్రతి కదలికపై నిరంతర పర్యవేక్షణ సాధ్యమవుతుందని పేర్కొన్నారు.
గ్రామంలో జరిగే అసాంఘిక ఘటనలు, నేరాలకు సంబంధించిన దృశ్యాలు నమోదై విచారణలో కీలక సాక్ష్యాలుగా ఉపయోగపడతాయని చెప్పారు. జిల్లా ఎస్పీ నరసింహ ఆదేశాల మేరకు గ్రామంలో భద్రతా చర్యలను బలోపేతం చేస్తూ ఈ కెమెరాలను ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. గ్రామంలోకి ఎవరెవరు వచ్చి వెళ్తున్నారు, ఎలాంటి అనుమానాస్పద కదలికలు ఉన్నాయన్న విషయాలను ఈ కెమెరాల ద్వారా గుర్తించవచ్చని తెలిపారు. గ్రామస్థులు, సర్పంచ్ సహకారంతో కెమెరాల ఏర్పాట్లు పూర్తిచేసినట్లు పేర్కొన్నారు. యువత మత్తు పదార్థాలు, చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలని డీఎస్పీ సూచించారు. గంజాయి వంటి మత్తు పదార్థాలకు బానిసై భవిష్యత్తును నాశనం చేసుకోవద్దని హితవు పలికారు. రైతులు కూడా అప్రమత్తంగా ఉండి గ్రామ భద్రతలో భాగస్వాములు కావాలని కోరారు.
ఈ కార్యక్రమంలో పోలీసు కళాబృందం రోడ్డు ప్రమాదాల నివారణ, మోసాలపై జాగ్రత్తలు, మత్తు పదార్థాల నిర్మూలన, మహిళల భద్రత, యువత భవిష్యత్తు వంటి అంశాలపై ఆటపాటల ద్వారా గ్రామస్థులకు అవగాహన కల్పించింది. ఈ కార్యక్రమంలో నాగారం సీఐ నాగేశ్వరరావు, గ్రామ సర్పంచ్ కృష్ణయ్య, ఉప సర్పంచ్ బోనాసి ఎల్లమ్మ, మండల రెవెన్యూ అధికారి బి. హరిప్రసాద్, ఎస్సై గుత్తా వెంకటరెడ్డి, గ్రామ పెద్దలు, యువత, వార్డు సభ్యులు, గ్రామస్థులు పాల్గొన్నారు.






