- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
పేదవాళ్ళ సొంతింటి కలను నెరవేరుస్తున్న "ఇందిరమ్మ ఇంటి పథకం"
రాష్ట్రంలో ప్రతీ పేదవాడి చిరకాల వాంఛ అయిన సొంతింటి కల కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన ఇందిరమ్మ ఇళ్ల పథకం ద్వారా నెరవేరుతుందని టీజిఐఐసి చైర్ పర్సన్ నిర్మలా జగ్గారెడ్డి అన్నారు.

దిశ, సంగారెడ్డి : రాష్ట్రంలో ప్రతీ పేదవాడి చిరకాల వాంఛ అయిన సొంతింటి కల కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన ఇందిరమ్మ ఇళ్ల పథకం ద్వారా నెరవేరుతుందని టీజిఐఐసి చైర్ పర్సన్ నిర్మలా జగ్గారెడ్డి అన్నారు. బుధవారం సంగారెడ్డి మున్సిపాలిటీ 29 వ వార్డులో ఇందిరమ్మ ఇంటి గృహ ప్రవేశం లో ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల ముఖాల్లో ఆనందం చూస్తే కడుపు నిండి పోతుందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ఈ ప్రతిష్టాత్మక పథకం ద్వారా లక్షల మంది లబ్ధిదారులు సొంతింటి కలను నెరవేర్చుకున్నారన్నారు. ఇంకా ఇందిర్మమ ఇంటి పథకానికి దరఖాస్తు చేసుకోని లబ్ధిదారులు ఎవరైనా ఉంటే వెంటనే దరఖాస్తు చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ కూన వనితా సంతోష్, పట్టణ అధ్యక్షుడు కిరణ్ గౌడ్, నాయకులు కూన సంతోష్, కౌన్సిలర్ సంగీతా మహేష్ తదితరులు పాల్గొన్నారు.






