- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
డ్రగ్స్ రహిత జీవితమే విజయానికి బాట : డీసీపీ శిల్పవల్లి
డ్రగ్స్ కు విద్యార్థులు దూరంగా ఉండాలనీ, దీనివల్ల విద్యార్థులు జీవితాలతో పాటు కుటుంబం చిన్నాభిన్నం అవుతుందని ఖైరతాబాద్ జోన్ డీసీపీ శిల్పవల్లి అన్నారు.

దిశ, కార్వాన్: డ్రగ్స్ కు విద్యార్థులు దూరంగా ఉండాలనీ, దీనివల్ల విద్యార్థులు జీవితాలతో పాటు కుటుంబం చిన్నాభిన్నం అవుతుందని ఖైరతాబాద్ జోన్ డీసీపీ శిల్పవల్లి అన్నారు. ఈ మేరకు బుధవారం అంతర్జాతీయ మాదకద్రవ్యాల వ్యతిరేక దినోత్సవం సందర్భంగా మాసబ్ ట్యాంక్ లోనీ ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో "సే నో టు డ్రగ్స్" అవగాహన సదస్సు కార్యక్రమాన్ని నాంపల్లి పోలీసులు నిర్వహించారు. ఈ సదస్సులో 200 మందికి పైగా విద్యార్థులు, అధ్యాపకులు, ఎన్‌సీసీ క్యాడెట్లు పాల్గొన్నారు. మాదకద్రవ్యాల అలవాటు వల్ల శారీరక, మానసిక ఆరోగ్యం ఎలా దెబ్బతింటుందో వివరించారు. డ్రగ్స్ మహమ్మారి విద్యార్థుల చదువును, ఉజ్వల భవిష్యత్తును, వారి కుటుంబాలను, సమాజాన్ని ఏ విధంగా ఛిన్నాభిన్నం చేస్తుందో, చట్టం ప్రకారం ఎదురయ్యే తీవ్రమైన శిక్షలను పోలీస్ అధికారులు వివరించారు. జీవితంలో ఎప్పటికీ మాదక ద్రవ్యాలకు దూరంగా ఉంటామని ఈ సందర్భంగా విద్యార్థులు ప్రతిజ్ఞ చేశారు.






