- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
వాగులో దూకి వ్యక్తి ఆత్మహత్య..!
by Taduka Kalyani |
మండలంలోని గోడపూర్ గ్రామానికి చెందిన భుజంగరావు బుధవారం సుద్దవాగులో దూకి ఆత్మహత్య చేసుకున్నట్లు ఎస్‌ఐ కృష్ణారెడ్డి తెలిపారు.

X
దిశ, కుబీర్: మండలంలోని గోడపూర్ గ్రామానికి చెందిన భుజంగరావు బుధవారం సుద్దవాగులో దూకి ఆత్మహత్య చేసుకున్నట్లు ఎస్‌ఐ కృష్ణారెడ్డి తెలిపారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, భుజంగరావు బుధవారం తెల్లవారుజామున సుమారు 4 గంటలకు ఇంటి నుంచి బయటకు వెళ్లాడు. అనంతరం లింగా బ్రిడ్జి సమీపంలో సుద్దవాగులో దూకి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మృతుడికి ఆర్థిక ఇబ్బందులు ఉండటంతో మనస్తాపానికి గురై ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన భార్య పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు ఎస్‌ఐ తెలిపారు. భార్య ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం భైంసా ఏరియా ఆసుపత్రికి తరలించినట్లు ఎస్‌ఐ కృష్ణారెడ్డి వెల్లడించారు.
Next Story






