- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
రేపటి నుంచే కాంగ్రెస్ గిరిజన నేతల బస్సు యాత్ర.. సీఎం రేవంత్‌తో భేటీ అయిన ప్రజాప్రతినిధులు
లంబాడి, ఎరుకల, యానాది తెగల ఎస్టీ రిజర్వేషన్ స్వర్ణోత్సవాల సందర్భంగా కాంగ్రెస్ గిరిజన ప్రజాప్రతినిధుల బస్సు యాత్ర నేటి నుంచి ప్రారంభం కానుంది.

దిశ, తెలంగాణ బ్యూరో: తెలంగాణలోని లంబాడి, ఎరుకల, యానాది తెగల రిజర్వేషన్ స్వర్ణోత్సవ వేడుకల సందర్భంగా.. నేటి నుంచి ఆయా వర్గాలకు చెందిన కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు ఉమ్మడిగా 'బస్సు యాత్ర' చేపట్టనున్నారు. ఈ సందర్భంగా బుధవారం సీఎం రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసి, ఈ బస్సు యాత్ర ఉద్దేశాన్ని నేతలు వివరించారు. ఈ సమావేశంలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డితో పాటు ఎంపీ బలరామ్ నాయక్, ప్రభుత్వ విప్ రామచంద్ర నాయక్, ఎమ్మెల్యే బాలు నాయక్, ఎమ్మెల్సీ శంకర్ నాయక్, మాజీ ఎంపీ రవీంద్ర నాయక్ తదితరులు పాల్గొన్నారు.
1976లోనే ఎస్టీ జాబితాలో చేర్చిన ఇందిరాగాంధీ..
నేటి నుండి తెలంగాణ ఆదివాసి విభాగం ఆధ్వర్యంలో గాంధీ భవన్ నుండి మొదటి దఫా బస్సు యాత్ర ప్రారంభం కానుందని, ఈ నెల 30 వరకు ఐదు రోజుల పాటు ఇది కొనసాగుతుందని ట్రైకార్ చైర్మన్ బెల్లయ్య నాయక్ తెలిపారు. ఈ మేరకు ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఈ బస్సు యాత్రను టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ప్రారంభిస్తారని, ఈ కార్యక్రమానికి మంత్రులు అడ్లూరి లక్ష్మణ్ కుమార్, జూపల్లి కృష్ణారావు హాజరవుతారని వెల్లడించారు. తొలిరోజు మైసిగండి మైసమ్మ అమ్మవారిని దర్శించుకున్న అనంతరం, కల్వకుర్తిలో నియోజకవర్గ స్థాయి సమావేశం నిర్వహిస్తామని చెప్పారు. ఆ తర్వాత అచ్చంపేట, నాగర్‌కర్నూల్, వనపర్తి జిల్లాలలో ఈ యాత్ర కొనసాగుతుందని వివరించారు.
1976లో అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ 'ఏరియా రిస్ట్రిక్షన్ రిమూవల్ యాక్ట్' (Area Restriction Removal Act) తీసుకొచ్చి తెలంగాణలోని లంబాడి, ఎరుకల, యానాది గిరిజనులను ఎస్టీ (ST) జాబితాలో చేర్చారని బెల్లయ్య నాయక్ గుర్తుచేశారు. ఇందిరాగాంధీ గిరిజనులకు రిజర్వేషన్లు కల్పించడం వల్లే ఈరోజు తామందరం ఉన్నత చదువులు చదువుకుని, ఉద్యోగాలు చేస్తూ ఉన్నత స్థానాల్లో రాణించగలుగుతున్నామని ఆయన కొనియాడారు.






