- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కరిగి పోతున్న మేఘాలు- ఆవిరైపోతున్న రైతన్నల ఆశలు
కమ్ముకున్న కారు మబ్బులు కళ్ళముందే కరిగిపోయి ఖరీఫ్ సాగుపై పెట్టుకున్న రైతన్నల ఆశలు ఆవిరి అయిపోతున్నాయి.

దిశ, మాచారెడ్డి : కమ్ముకున్న కారు మబ్బులు కళ్ళముందే కరిగిపోయి ఖరీఫ్ సాగుపై పెట్టుకున్న రైతన్నల ఆశలు ఆవిరి అయిపోతున్నాయి. గత రెండు, మూడు సంవత్సరాలు వద్దన్నా వర్షాలు అన్న చందంగా కురిసి రైతన్నల ఆశలు రెట్టింపు సాగు విస్తీర్ణం పెరిగింది. ప్రస్తుత ఖరీఫ్ పై వరుణుడు మొండి చేయి చూపడంతో వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయి. మునుపటిలాగే ఖరీఫ్ సీజన్ కు వర్షాలు కురుస్తాయని ఆశించిన రైతాంగం దుక్కులు దున్నుకొని పచ్చిరొట్ట ఎరువు విత్తనాలు చల్లుకొని నేలను సాగుకు సిద్ధం చేసుకున్నారు. ఓ పక్క ప్రభుత్వం సన్నాలను పండించి బోనస్ ను పొందండి. వరి సాగు తగ్గించి ఆయిల్ ఫామ్ వైపు దృష్టి పెట్టండి అనే ప్రచారం ముమ్మరం చేసింది. ఇటు ప్రభుత్వ ఆంక్షలు అటు ప్రకృతి ప్రతికూల పరిస్థితుల నేపథ్యంలో రైతన్నలు అయోమయానికి గురవుతున్నారు.
రెండు బలమైన కార్తెల్లో వర్షాభావం ..
ఖరీఫ్ సీజన్ ఆరంభంలో వచ్చే రోహిణి, మృగశిర కార్తెలు బలమైనవి గా భావిస్తారు. విత్తనాలు పోయడానికి ఆ రెండు కుమార్తెలతో పాటు ఆర్ద్ర కార్తె తో విత్తనాలు విత్తుకునే సమయం ముగిసిపోతుంది. ఆర్ద్ర కార్తె ప్రవేశించి నాలుగు రోజులు గడిచింది. మరో పదకొండు రోజులు మాత్రమే మిగిలి ఉంది. విత్తనాలు విత్తుకునే వారికి 11 రోజులే అవకాశం. తొలకరి తో పాటు ఒక్కటి కూడా భారీ వర్షం నమోదు కాలేదు. దీంతో బోరు బావులు ఉన్న రైతులు కూడా భోగభాజలాలపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మరి కొంతమంది రైతులు బోగర్భ జలాల కోసం బోరుబావుల తవ్వకం ప్రారంభించారు. సాగునీటి కోసం ఆర్థిక భారం మోయక తప్పదా అనే ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
అటు ఎలినోన్ ఇటు సున్నాలు ..
ప్రకృతి పరంగా ఎలినోన్ ప్రభావంతో అధిక వర్షాలు లేదా వర్షాభావ పరిస్థితి ఎదురవుతుందని వాతావరణ నిపుణులు, ప్రభుత్వం వ్యవసాయ శాఖ ద్వారా ప్రచారం చేస్తుంది. మరోపక్క దొడ్డు రకం వరి వద్దు సన్నాలే ముద్దు అనే తీరుగా ప్రభుత్వం విత్తన మేళాలు నిర్వహించి రైతులను సన్నాళ్లవైపు దృష్టి మరల్చింది. ఈ రెండు కూడా రైతన్నకు ఏ మాత్రం అనుకూలించకపోవడంతో ఆందోళన నెలకొంది. అయినప్పటికీ వాతావరణ పరిస్థితుల వల్ల రైతులు సన్న రకం విత్తనాలు తెచ్చి దుక్కి తుకాలు పోసుకున్నారు. ఎండలకు వాడు చూపుతున్న నారును రక్షించుకోవడానికి బోరుబావుల నీటితో తడులు పెడుతున్నారు. కనీసం నారు దక్కే వర్షం కూడా పడకపోవడం వాతావరణ ప్రతికూల పరిస్థితులు అంచనాలకు అందకుండా పోతున్నాయి.






