- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
అన్నపై తమ్ముడు గునపంతో దాడి
గ్రామ పెద్దల ముందే అన్నపై గునపంతో విచక్షణారహితంగా తమ్ముడు దాడికి పాల్పడ్డాడు.

దిశ, గీసుకొండ : గ్రామ పెద్దల ముందే అన్నపై గునపంతో విచక్షణారహితంగా తమ్ముడు దాడికి పాల్పడ్డాడు. ఈ హత్యాయత్నం కేసులో తమ్ముడిపై కేసు నమోదు చేసి రిమాండ్ కు తరలించినట్లు సీఐ విశ్వేశ్వర్ తెలిపారు. సీఐ విశ్వేశ్వర్ కథనం ప్రకారం...అనంతారం గ్రామానికి చెందిన దొనికుల రామానుజం, తల్లిదండ్రుల నుంచి వచ్చిన 2 ఎకరాల భూమిని రెండు దశాబ్దాలుగా సాగు చేస్తున్నారు. తల్లిదండ్రులు మరణించాక ఆ భూమిలో తన వాటా కావాలని తమ్ముడు శ్రీనివాస్ గ్రామ పెద్దలను ఆశ్రయించాడు. రెండేళ్ల క్రితం బోర్ ఉన్న భూమి శ్రీనివాస్‌కు, మిట్ట భూమి రామానుజంకు అని పంచాయతీ తీర్పు ఇచ్చింది.
అయినా చెరిసగం పంచాలని శ్రీనివాస్ పట్టు బట్టడంతో వివాదం సాగుతూ వచ్చింది. ఈ నెల 15న భూ కొలతల సమయంలో తల్లిదండ్రుల పోషణ అంశంపై రామానుజం మాట్లాడడంతో రెచ్చిపోయాడు శ్రీనివాస్. ఇక అక్కడే ఉన్న గునపం తీసి అన్నపై విరుచుకుపడ్డాడు. రామానుజం చేయి అడ్డుపెట్టడంతో గునపం చేయిని చీల్చుకుంటూ దిగింది. ఇక శ్రీనివాస్ ను పట్టుకొని కోర్టులో హాజరుపరచగా న్యాయమూర్తి రిమాండ్ విధించారు.






