దిశ ఎఫెక్ట్

by Ratna Kumari |

డోంగ్లి మండల కేంద్రంలో పారిశుధ్య లోపాలపై 'దిశ' ప్రచురించిన "చెత్త కదలదు.. మురుగు పారదు" కథనానికి అధికారులు తక్షణమే స్పందించారు.

దిశ ఎఫెక్ట్
X

దిశ, డోంగ్లి (మద్నూర్) : డోంగ్లి మండల కేంద్రంలో పారిశుధ్య లోపాలపై 'దిశ' ప్రచురించిన "చెత్త కదలదు.. మురుగు పారదు" కథనానికి అధికారులు తక్షణమే స్పందించారు.బుధవారం గ్రామ పంచాయతీ సిబ్బంది రంగంలోకి దిగి శుభ్రత పనులు ప్రారంభించారు. ప్రధాన రోడ్డు పక్కన ప్లాస్టిక్ కవర్లు, బాటిళ్లు, ఇతర వ్యర్థాలతో పూడుకుపోయిన మురికి కాలువల్లో పూడిక తొలగించారు. పాకురు పట్టి నిరుపయోగంగా మారిన సిమెంట్ నీటి కుండీలను కూడా శుభ్రం చేస్తున్నామని పారిశుద్ధ్య పనులు ఇంకా కొనసాగుతున్నాయని డోంగ్లి గ్రామ పంచాయతీ కార్యదర్శి తెలిపారు. "దిశ కథనంతో" స్పందించిన అధికారుల తీరుపై స్థానికులు హర్షం వ్యక్తం చేశారు.

Next Story